అసలు పాతివ్రత్యం అంటే ఏమిటి ?

ఏ శాస్త్రం లోను ,పురణాలలోను ,స్మృతుల్లోను పాతివ్రత్యం స్త్రీలకు మాత్రమే ఉండాలని చెప్పలేదు. ఒకవేళ అది ఎవరన్నా పలానా శాస్త్రంలో ఉంది అంటే తప్పుడు శాస్త్రము. హిందు మతం ఏకపత్నీ వ్రతాన్ని ప్రోత్సహించింది.

ఎందుకంటే రాముడు ఏకపత్నీ వ్రతుడు. అందుకే మనం ఎక్కువగా దేవుడిగా రాముడిని చెప్పుకుంటాము. మరి కృష్ణుడికి అంత మంది భార్యలు ఎందుకు వున్నారు? ఆయన అస్కలిత బ్రహ్మచారి అంటే ఒక్క స్త్రీ తోటి కూడా సంభోగం చెయ్యలేదు.( ఆ విషయం ఇంకో వ్యాసంలో పూర్తిగా రాస్తాను ఇప్పుఫు కాదు)

ముందుగా పాతివ్రత్యం అంటే ఏంటో తెలుసా మీకు . కన్యతనంలోనే కర్ణుడికి జన్మ నిచ్చి,తరువాత 5 గురు దేవుళ్ళ వల్ల ధర్మరాజు, భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు లకు జన్మనిచ్చిన కుంతి, పతివ్రత. 5 మంది భర్తలు ఉన్న ద్రవుపది కూడా పతివ్రతే. దేవేంద్రుని తో సంగమం జరిపిన అహల్య పతివ్రతే. వాలి సుగ్రీవులతో సంసారం చేసిన తార కూడా పతివ్రతే. అవును వీరు అందరూ పతివ్రతలు.

పాతివ్రత్యానికి పర పురుష సంగమనికి చాలా తేడా ఉంది. పతివ్రత్య మంటే పతితో జీవించట మనే నియమం ఆ రోజుల్లో ఋషులు చెప్పారు. అలా కాకుండా స్త్రీ స్వేచ్ఛ కాముకత్వంతో జీవిస్తే తర్వాత పరిణామాలేంటి? వాళ్లకు పుట్టే సంతానానికి తొడెవ్వరు? భర్త లేని స్త్రీకి భద్రత ఏమిటి ? తండ్రి తెలియని బిడ్డలకు దిక్కు ఎవరు ? అందుకే స్త్రీకి పాతివ్రత్యం పెట్టారు అని శాస్త్రం చెబుతోంది.

మగవాడు సంభోగం చేసి వెళ్ళిపోతాడు, తర్వాత కష్టాలన్నీ స్త్రీకి కదా! గర్భం స్త్రీ కి వస్తుంది కాని పురుషుడికి రాదు ,పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చి పెంచలేడు. అది గాక శృంగార విషయంలో పురుషుడు హీనుడు, స్త్రీ దేవత అని మహర్షులు స్త్రీలకు పాతివ్రత్య నియమం పెట్టారు అని శాస్త్రం చెబుతోంది.

అంతే గాని శాస్త్రాలు, స్మృతులు , పురాణాలు పురుష పక్షపాతం అని కాదు.

సర్వే జనః సుఖినోభవంతు…….

 

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

22 comments

  1. super artical

  2. Very nice artical

  3. చాలామందికి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు అన్నగారు..మీరు చాలా గ్రేట్..

  4. ఆనంద్ జంపాని

    Nice artical

    • అక్షింతల పార్థసారథి

      అద్భుతం చాలా చక్కగా తెలియజేశారు

  5. ఆనంద్ జంపాని

    Super artical

  6. Raja Ramesh Reddy.Bandi

    Realistic information

  7. Nice information

  8. PadmaAvadhanam

    Good massage

  9. Avadamam prasad

    Good imfermatipm

  10. Dhulipalla raghavendrarao

    Excellent article for everyone

  11. Akshintala Parthasaradhi

    Super

  12. Akshi ntala. Sakuntala

    Good

  13. Akshintala Sakuntala

    Nice information good

  14. Awesome

  15. Padarthi Balaji

    Superrrr

  16. Good information

  17. super article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *