అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య తేడా తెలుసుకోండి

అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య తేడా తెలుసుకోండి ఇలా:

1. ఒక గిన్నెలో నీరు పోసి దానిలో రుద్రాక్షని వేసినట్లు ఐతే నకిలీది మునగదు తేలుతుంది. అంతేగాక రంగు వెలిసిపోయినట్లు ఉన్నచో అది నకిలీది .

2.  ఆవుపాలలో అసలైన రుద్రాక్షని వేసి ఉంచిన ఆ పాలు 48 గంటల నుండి 72 గంటల వరకు చెడిపోకుండా విరగకుండా ఉంటాయి

3. రెండు పాత్రల మధ్య రుద్రాక్షని ఉంచినప్పుడు రుద్రాక్ష తిరుగును.

4. పురుగులు తిన్నవి , పగిలినవి ధరించరాదు .

5.  రుద్రాక్షని బాగా వేడిగా ఉన్న నీటిలో వేస్తే మునిగిపోతే అది నిజమైనది. కొంతమంది ఇరుగుడు చెట్టు కొయ్యతో రుద్రాక్షలు తయారుచేస్తారు. జాగ్రత్తగా చూసి కొనవలెను .

6. ఒక చిన్న గ్లాసులో రుద్రాక్ష మునిగేంత ఎత్తుటి వరకు చల్లని నీరు నింపి రుద్రాక్షని ఉంచి ఒక అరగంట తరువాత ఆ నీటి ఉష్ణోగ్రతని ధర్మామీటరుతో కొలిచినట్లైతే కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ఉంటుంది.

7. రుద్రాక్షలలో అర్ధనారీశ్వర రుద్రాక్షలు ఉంటాయి. వాటిని నకిలీలుగా తయారుచేయుటకు రెండు రుద్రాక్షలను శిలపైన అరగదీసి అతికిస్తారు. కావున జాగ్రత్తగా గీతను చూసి కొనవలెను .

8. రెండు రాగిరేకుల మధ్య రుద్రాక్షని ఉంచినట్లయితే అది తనచుట్టూ తానే సవ్యదిశలో తిరుగును. అపసవ్య దిశలో తిరిగిన అశుభ ఫలితాలు కలుగును.

9. రుద్రాక్షని 7 రోజుల పాటు నూనెలో ఉంచాలి. అవి ఏరంగు రుద్రాక్ష అయిన దాని రంగు ప్రభావితం అగును. ఆ తరువాత కాగితం లేక దూదితో శుభ్రపరచి నీటితో కడిగించాలి. అతరువాత ధరించినచో రంగు ప్రభావితం కానిచో అవి అసలైన రుద్రాక్షలు .

10. రుద్రాక్షలు ఎక్కువుగా కాశి , హరిద్వార్ లలో లభ్యం అగును. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగును. ఒక నిజమైన రుద్రాక్షను ధరించినచో మంచి ఆరోగ్యం మరియు ఉన్నతస్థితిని ఇచ్చును. రుద్రాక్షలో ప్రకృతి సిద్ధముగానే రంధ్రం ఉండును.

About Ashok Kanumalla

Ahsok

6 comments

  1. Uma naidu akkana

    Exlent

  2. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

    చాల మంచి విషయం

  3. Rudrakshalu vesukunte manchida..

  4. Thank you

    Mem mosapokudadane me goppa manasuku krutajnatalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *