ఆడపిల్లలకు రజస్వల వేడుకలు ఖచ్చితంగా జరిపించాలా ?జరిపించక పోతే ఏమవుతుంది ?

రజస్వల విషయానికి శాస్త్రబద్ధమైన సమాచారం లేదు, తర్కబద్ధంగా సమాధానం వుంది. ఆడపిల్లలు పదకొండవ సంవత్సరం నుండి పదునాల్గవ సంవత్సరం లోపుగా సాధారణంగా రజస్వల అవుతారు. ఇది సృష్టి నియమం.ఇంకో చిన్న విషయం ఏమిటంటే మొదటిగా పన్ను ఊడిన రోజు నుంచి కరెక్టుగా అదే 6 సంవత్సరాల తర్వాత అదే రోజు రజస్వల అవుతుంది అని అంటుంటారు పెద్దలు.

అయితే సర్వసాధారణమైన ఈ సృష్టినియమానికి ఎంతో అబ్బురంగా వేడుకలు ఎందుకు జరిపించాలి. ఇదేదో అనాగరిక ఆచారం కాదా అని మనకు అని పిస్తుంది. కాని ఈ కార్యక్రమంలో మనమెరుగనిమర్మం ఒకటుంది.

గతంలో జమిందారీ విధానం వైభవంగా నడుస్తున్న రోజుల్లో జమీందారీ ఆడ పడుచులు రజస్వలలైనపుడు తిథి వార నక్షత్రాలను సరిచూచి గ్రహ శాంతులు అన్నదానం చేసే ఆచారం విధిగా నడిచేది. ఆడపిల్ల రజస్వల కావటం అంటే మాతృత్వానికి సిద్ధమైందన్న మాట. సృష్టిని స్థిరీకరించే స్త్రీగా రూపు దిద్దుకొన పోతున్నదనమాట.జన్మనిచ్చే మాతృదేవతగా మారనున్నదన్న మాట. శుభ భూయాత్, భద్రం భూయాత్; శ్రీ: భూయాత్; సమస్త సన్మంగళాని భవంతు అంటూ కుల పెద్దలు, బంధుమిత్రులచే గురుపూజ్యులచే, ఆశీర్వచనా లిప్పించే ఆచారాన్ని వేడుకలు చేస్తారు. ఇదీ, ఈ వేడుకలోని పరమార్థం. వేడుకలు చేయకుంటే అరిష్టం మాత్రం కలుగదు.

అంతే కాక 1929లో శారదా చట్టం వచ్చి బాల్యవివాహాలను నిలుపు చేసింది ఇంతకుముందు కాలంలో “అష్టవర్షాభవేత్ కన్య” అనే సంప్రదాయం మనకు వుండేది. అంటే ఎనిమిది సంవత్సరాలవయసు వచ్చిన ఆడపిల్లను ‘కన్య’ అని పిలిచేవారు. బాల్యావస్థపోయి కన్యగా మారుతుందన్నమాట. కన్యాత్వం రాగానే రజస్వల కాకుండానే ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేసేవారు. పెండ్లి జరిగిన మూడు నాలుగేండ్లకు అమ్మాయి రజస్వల అయ్యేది. ఈ శుభవార్తను అమ్మాయి అత్తింటివారికి బంధువులు తెలియజెప్పే శుభవేడుకనే డబ్బున్నవారు ఘనంగా, మధ్యతరగతివారు మామూలుగా, పేదవారు నిరాడంబరంగా జరుపు కొనేవారు.

అదీగాక ఆడపిల్లలు పెండ్లి చేయాలంటే ఆరుజతల చెప్పులు అరిగి తీరాలి’ అనే సామెత వుండేది. రజస్వల అయిన ఆడపిల్లను మంచి యింటికి కోడలిగా పంపాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు, ఆశపడతారు. ఆడపిల్ల తండ్రి వరాన్వేషణలో పడి ఆవూరు ఈవూరు తిరగాల్సి వచ్చేది. ఇప్పటిలాగా ఆరోజుల్లో వాహనసౌకర్యాలు లేవుగదామరి. ఈ శ్రమనుండి బయటపడాలంటే ఆడపిల్ల రజస్వల కాగానే బంధుమిత్రులందరికీ తెలియపరచి పండుగ జరిపించితే ఎవరొకరు ద్వారానైనా మంచి వరుడు దొరుకుతాడని, భారం తీరిపోతుంది ఆడపిల్ల ప్రథమ ఋతుమతీ వేడుకలు చేసే సంప్రదాయం వచ్చింది.కాబట్టి ఇపుడు పెండ్లి కొడుకు కోసం వెతకాల్సిన పని లేదు కాబట్టి చాలామంది ఈ కార్యక్రమం చేయట్లేదు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

9 comments

 1. మల్లికార్జున రావు ఊరందూరు

  ఇప్పటికీ ఈ ఆచారం నడుస్తోంది

 2. Raja Ramesh Reddy.Bandi

  Good information

 3. Telusukovalasina vishayalu

 4. అక్షింతల పార్థసారథి

  అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు

  చాలా బాగా చెప్పారు

  రాసింది ఎవరైనా ఇవన్నీ

  మాకు గుర్తు చేస్తున్నందుకు

  ముందుగా మీకు ధన్యవాదములు

  మీ వలన మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం

 5. Akshi ntala. Sakuntala

  Use full information

  Thanks for post B r

 6. Chala manchi vishayam chepparu

 7. Wooow spr

 8. Exellent information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *