ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషనివారణ కల్గి సంసారం అన్యోన్యంగా ఉంటుందా ?

దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు  ఎందుకుంటాయి…?

 

రావిచెట్టుకి అశ్వత్థవృక్షమనీ, బోధివృక్షమనీ పేర్లున్నాయి. దాదాపు దేవాలయాలు రావిచెట్టు లేదా వేపచెట్టు వుంటాయి. ఎక్కువచోట్ల రావి వేప కలిసి వుంటాయి. రావి చెట్టు పురుషునిగా, వేపచెట్టు స్త్రీగా భావించి పూజించటం ఎక్కువ. రాగిని విష్ణు స్వరూపంగానూ, వేపను లక్ష్మీ స్వరూపం గానూ భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషనివారణ కల్గి సంసారం అన్యోన్యంగా వుంటుందని హిందువుల నమ్మకం. రావి వృక్షం గురించి ‘పద్మపురాణం’లో వివరించబడింది.

 

రావిచెట్టు లో అణువణువూ నారాయణ స్వరూపమేనని ఆగమశాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈ విషయాన్ని స్కందపురాణం కూడా చెబుతుంది అందుకే శ్రీకృష్ణుని ‘వటపత్రశాయి’ అంటారు. పసిబిడ్డకు జోలపాడేటపుడు వటపత్ర శాయికి వరహాల లాలి’ అని పాడుతూ నిద్రపుచ్చటం వినేవుంటా అందరూ. (ఈనాటి తల్లులు పాడటం లేదనుకోండి) జ్యోతిష్య శాస్త్రంలో రావిచెట్టుకి ఓ ప్రత్యేకత వుంది. శనిదోషం పోవాలంటే ప్రతిరోజూ రావిచెట్టు నీడన నిలబడాలి. నమస్కరించాలి. కౌగిలించుకోవాలి

 

ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శని దోషం తొలగిపోతుంది రావిచెట్టు కొమ్మలతో యజ్ఞయాగాలు చేస్తారు సన్యాసులు రావిచెట్టు కర్రను దండగా తీసుకుంటారు రావిచెట్టు నీడన కాసేపు కూర్చుంటే బి.పి. తగ్గుతుంది.

 

 

రావిచెట్టు గాలి మంచి ఆలోచనలను కల్గిస్తుంది శుద్దోధనుడు కుమారుడైన సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించినా కలుగని జ్ఞానోదయం, రావిచెట్టు క్రింద విశ్రమించిన తరువాత.  మహా జ్ఞానోదయం కలిగి ‘బుద్ధుడు’ అయ్యాడు. అందువల్లనే రావి చెట్టు ‘బోధివృక్షం’అంటారు.బౌద్ధమతస్థులు       ఈ చెట్టు మహాపవిత్రమైనది. శ్రీకృష్ణుడు చివరిదశలో ఈ వృక్షం క్రిందనే విశ్రమించి ప్రాణత్యాగం చేశాడు. ఈ వృక్షం ఆడ, మగ పువ్వులు పుష్పించి కాయలు కాస్తుంది.వేప వృక్షం కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దివ్యవృక్షం. వేప వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప ఆకును ఎన్నో రోగా లకు మందులు వాడతారు. వేప చెట్టు గాలికి ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి. వేపాకులను నీటిలో వేసి కాచి త్రాగినా, స్నానం చేసినా చర్మ వ్యాధులు సూక్ష్మక్రిములు నశిస్తాయి. వేపచెట్టువంటి దివ్య ఔషధ వృక్షం భూలోకం లో మరొకటి లేదు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

10 comments

 1. ఏ ఏ వృక్షములనూ పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని స్వామిజీగారు బాగా వివరించారు
  ధన్యవాదాలు

 2. Excellent information

  • అక్షింతల పార్థసారథి

   అశోక్ కుమార్ గారు

   ఇంకా ఇంకా చాలా చాలా

   మంచి విషయాలు చెప్తున్నారు

   చదువుతూ ఉంటే ఇంకా చదవాలని

   ఉంది మాకు కూడా ఆనందాన్ని

   ఇస్తున్నాయి మీరు అదృష్టవంతులు

   మీ సత్సంగ త్యం వల్ల

   మేము కూడా lucky

   సమస్త సన్మంగళాని భ వంతు

   శుభమస్తు శుభరాత్రి

 3. Good information 👍 Tq verymuch

 4. రాగి, వేప చెట్టు గురించి ఆచెట్ల కళ్యాణం గురించి చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు

 5. Thank you for giving good information

 6. Raja Ramesh Reddy.Bandi

  Very true
  🙏🙏🙏🙏🙏

 7. Nice information

 8. మల్లికార్జున రావు ఊరందూరు

  వృక్షో రక్షతి రక్షితః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *