ఈ 10 వస్తువులను అధిక మాసంలో దానం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయా

పురాణాల్లో అధికమాసానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతీ వ్యక్తి తన శక్తిమేరా దానం చేసి పుణ్యం సంపాదించవచ్చు. ఈ నెలను అధిక మాసం అనడానికి కారణం, మనకు సంవత్సరానికి 12 నెలలు ఉండగా, ఈ నెలను మాత్రం13వ నెలగా పిలుస్తారు. అంటే ఇది అధికంగా వచ్చే మరో మాసం. కాబట్టి దీన్ని అధిక మాసం అంటారు. ఈ నెలలో భక్తులు విష్ణుమూర్తిని పూజించి ఆ ప్రసాదాన్ని దానం చేయాలి.

అధిక మాసంలో జపం చేయడం, తపస్సు, ఆరాధన , ఉపవాసం, దానాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. అధిక మాసం ప్రతీ మూడు సంవత్సరాలకు వస్తుంది. మనం చేసే ప్రతి మంచి పనికి ఎన్నో లాభాలను తెస్తుంది. అధిక మాసంలో దానాలు చేయాలి అని చాలా మందికి తెలుసు. కానీ అందులో ఎలాంటి వస్తువులు దానాలు చేయాలి అనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు. నిజానికి దానం చేయడం వల్ల మన జీవితంలో ఉండే సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. పాపవినాశనం కలుగుతుంది అని పెద్దలు చెప్పడం మనం వినే ఉంటాము.

ఈ అధిక మాసంలో విష్ణువు పూజకు, ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, పూజలు, ఆయన మంత్రాలను జపించడం వల్ల సమస్యలు తీరుతాయి. అధిక మాసం ఎంత పవిత్రమైన మాసం అంటే ఈ నెలలో విష్ణుమూర్తితో కటాక్షంతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. ధనధాన్యాలతో, పిల్లాపాపలతో సంతోషం కలుగుతుంది.

అధిక మాసంలో ఈ 10 వస్తువులను దానం చేయడం వల్ల అత్యధిక పుణ్యం వస్తుంది. దానం చేయాల్సిన వస్తువులు బెల్లం , నెయ్యి , బియ్యం,నల్ల నువ్వులు,పేలాలు,పాయసం,పానకం,గొడుగు,అన్నం,వస్త్రం వంటి వాటిని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాధలు తొలగుతాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. వచ్చే జన్మకు కావాల్సిన ఆనందాన్ని ఇప్పుడే మీరు సంపాదించుకున్నట్టు. అంటే రానున్న జన్మ మరింత ఆనందకరంగా ఉంటుంది. ఈ జన్మలో మనిషి సంతోషాన్ని పొందగలుగారు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

వివాహం అలస్య మవుతోందా ? మీరు అనుకున్న వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇలా చెయ్యండి

1. పార్వతి దేవిని ఆరాధించాలి. 2. ఎర్రని మరియు నల్లని దుస్తులు ధరించవద్దు. 3. మీ ఆలోచనలను ఇతరులకు వెల్లడించవద్దు. …

5 comments

 1. Gud information adhikamaasam daanaalu importence theliyachesinamduku dhanyavaadamulut 👌👌👌👌👌

 2. చాల మంచి విషయాలు తెలిపారు సంతోషం.

 3. అక్షింతల పార్థసారథి

  సర్వేజనా సుఖినోభవంతు

  చాలా మంచి విషయాలు

  మీరు చెప్పినందుకు కు

  ధన్యవాదములు అశోక్ కుమార్ గారు రు

 4. Oooo woow tappaka patistamu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *