ఏలినాటి శని అంటే ఏమిటి? దాని నివారణ చర్యలు ఏమిటి

ఏల్నాటి శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం అని, అష్టమ శనిదోషం అని శనిదోషాలు మూడు రకాలుగా ఉంటాయి.

ఈ ఏల్నాటి శనిదోషం ఏడున్నర సంవత్సరములు ఉంటుంది. ఈ శనిదోషం 3 భాగాలుగా ఉంటుంది .ఒక్కో భాగం రెండున్నర సంవత్సరం ఉంటుంది.ఒక్కో రెండున్నర సంవత్సరం ఒక్కో విధమైన కష్టాలు వస్తాయి.
1.మొదటి రెండున్నర సంవత్సరాలు ఊహించని ఖర్చులు అధికమవ్వడం, అశాంతి, సుఖం లేకపోవడం, ఆందోళన వంటివి ఉండగలవు.

2. రెండో రెండున్నర సంవత్సరాలు ఆరోగ్యములో అధికమైన సమస్యలు తలెత్తడం, పరస్పర అవగాహనాలోపం, మనిషి క్షీణించడం, చికాకులు వంటివి ఉండగలవు.

3. మూడో రెండున్నర సంవత్సరం ధన, కుటుంబ, వాక్ స్థానము నందు శని సంచారం వల్ల విరోధులు పెరగటం, అపజయం, తొందరపడి సంభాషించడం, ఆర్థిక ఒడిదుడుకులు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో పనిభారం పెరగడం, పెద్దలకు వీడ్కోలు పలకడం వంటివి ఉండగలవు.

ఇవియే కాక శనీశ్వరుడు ఇంకో 5 సంవత్సరములు అనగా అర్ధాష్టమ శనిదోషం: అర్ధష్టమ శనిదోషం అనగా రాశి నుంచి 4వ స్థానము నందు శని సంచారం జరగడం. ఈ శని సంచారం వల్ల ప్రమాదాలు జరుగడం, విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపం, పెద్దల గురించి ఆందోళన, ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు వంటివి ఉండగలవు.

అష్టమ శనిదోషం: అష్టమ శనిదోషం అనగా రాశి నుంచి 8వ స్థానము నందు శని సంచారాన్ని అష్టమ శనిదోషం అంటారు. ఈ అష్టమ శనదోషం వల్ల ఆయుఃప్రమాణం తగ్గడం, ఆరోగ్యములో చికాకులు అధికమవ్వడం, ఆందోళనలు వంటివి ఉండగలవు. ఇలా మానవుని కి కష్టాలు పెట్టి క్రమశిక్షణతో పెడతాడు.

అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నవారు శని దేవున్ని ప్రసన్నం చేసుకుని ఈ నివారణ చర్యలు చేస్తే శుభం కలుగుతుంది.

1. శని గ్రహ దోషాలు తొలగిపోవాలంటే కోతులకు అరటి పండ్లు ఇవ్వాలి. శనివారం నాడు శనిదేవుని మంత్రాలను జపించడం శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలి. నల్లని వస్త్రాలు, నల్లని వస్తువులు దానం చేయటం మంచిది.

2. తీవ్ర వ్యాధులకు కారకుడు శనీశ్వరుడు.శనివారం నాడు శని మంత్రాలను జపించి నీలమణిని ధరించుటవలన శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. వస్త్రాలు ,ఇనుము,తోలుకు సంబంధించిన వస్తువులు, దానం చేయటం మంచిది.

3. శనివారం రోజు శనీశ్వరునికి అర్చన చేయించాలి. శని శాంతించడానికి పేదవరికి ఏదో రూపంగా సహాయ సహకారాలు అందించాలి.శనీశ్వర ప్రభావంతో ఏర్పడే ఈతిబాధలు తొలగిపోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుని ఆరాధన, అయ్యప్ప స్వామి దర్షనం చేయాలి. ఇవి చేస్తే శనిగ్రహ దోషం కొంత తగ్గుముఖం పడుతుంది.జాతకరిత్య మీ నక్షత్రానికి శని గ్రహ ప్రభావాన్ని బట్టి నీలం రత్నాన్ని ధరించడం ద్వారా శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు.

4. శని త్రయోదశి రోజు శనిదేవునుకి అభిషేకం చేయాలి.శనివారం నువ్వులనూనెను తలకు, శరీరం మొత్తం పట్టించి తలంటుస్నానం చేయాలి. శనీశ్వర గాయత్రిని రోజూ 108 సార్లు పఠించాలి. హనుమాన్ చాలీసా చదవాలి. బయటికి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించక ముందు కాళ్ళను కడుక్కోవాలి. ముఖ్యంగా శనివారం కోతులకు అరటిపండును ఇవ్వడం ద్వారా శనీశ్వర దోషాలు తొలగిపోతాయని శాస్త్రసూచనలు.
5. శనీశ్వరుడు శాంతి చెందాలంటే పేదలకు,పెద్దలకు,అవిటి వారికి,పశుపక్షాదులకు సాటివారికి సహాయపడితే శని దేవుడు శాంతించి శుభఫలితాలు ఇస్తాడు.కాలపురుషుని జీవనాధిపతి అయిన శనీశ్వరుడు కాలాన్ని అనుగుణంగా మార్చగలిగే శక్తి కలవాడు.అందుకే శనీశ్వరుడిని శనివారం స్తుతించే వారికి నువ్వుల దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవని పెద్దలు చెబుతుంటారు.

సర్వేజన సుఖినో భవంతు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు …

9 comments

 1. Very good information 👍

  • అక్షింతల పార్థసారథి

   ఆహా ఏమి చెప్పారు అశోక్ గారు

   చాలా బాగుంది మీ వివరణ థాంక్యూ

 2. Wow 😯 🙏🙏🙏🙏🙏

 3. చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు తప్ప క ఆచరణలో పెడితే మంచిది

 4. ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరమైన సమాచారాన్ని ఇస్తున్నా మీకు ధన్యవాదాలు….

 5. It’s very use ,ful information Tq

 6. Raja Ramesh Reddy.Bandi

  You are doing a great job, by giving such a valuable informatio to the society. Thank you
  🙏🙏

 7. Prati okkaru telusukodagina vishayam.

  Chala sulabhamaina margam ravi chettuku tiragatam.

  Thank you for your excellence

 8. Dhulipalla Raghavendra Rao

  శని భగవానునికి ఏ విధమైన ఉపచారములు చేయవలెనని సవివరంగా వివరించావు సంతోషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *