పౌర్ణమి వెళ్లిన తరువాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అంటారు. దానినే కృష్ణ అష్టమి మరియు కాళాష్టమి అని కూడా అంటారు. కాల బైరవ స్వామికి ఈ అష్టమి అంటే చాలా ఇష్టం.అందుకని ఆ రోజు కాలబైరవ స్వామికి కూష్మాండ(బూడిద గుమ్మడి కాయ) దీపారాధనచెయ్యాలి.
ఈ దీపారాధన ను ఎలా చేయాలి అంటే , ఎవరైతే ఈ దీపారాధన చెయ్యాలి అనుకుంటారో వారే స్వయంగా బూడిద గుమ్మడి కాయను మధ్యకు సమానం గా కోసి, దాని లోని గుజ్జుని, గింజలను తీసివేసి ,దానికి పసుపు కుంకుమ పెట్టి ,నువ్వుల నూనెను పోసి,పత్తి తో గాని,గుడ్డతో గాని వత్తిని వెలిగించాలి.దాని క్రింద ఇత్తడి పళ్లెం పెట్టాలి. అంతే గాని వేరే వాళ్ళు రెడి చేసిన గుమ్మడి కాయ దీపాన్ని మనం వెలిగిస్తే ఫలితం కచ్చితంగా రాదు.
ఆ తరువాత వెలిగించిన కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన కు నమస్కరించి మొదట తల్లికి, తండ్రికి, గురువుకి, కుల దేవునికి, గ్రామ దేవతకు,చండి మాతకు, చివరగా కాల బైరావ స్వామికి నమస్కారం చెప్పుకొని, అప్పుడు ఇలా అనుకోవాలి నేను కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన చేస్తున్నాను నా జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు అన్ని తొలగింప బడి సుఖం, సంతోషం, సౌభాగ్యం కావాలని కోరుకోవాలి.ఆతరువాత పంచోప చార పూజ (అంటే గంధం,కుంకుమ,పసుపు,దీపం)చేసి అగరు వత్తులు వెలిగించి గుమ్మడి కాయకు గుచ్చండి.తర్వాత కాల బైరావ నామవలి లేక అష్టకం చదవండి.ఈ పూజ కులం, మతం, లింగ భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు.
చండి హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఈ కూష్మాండ దీపారాధన చేస్తే అంత ఫలితం వస్తుంది అనేది శాస్త్ర నిర్వచనం. ఈ కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన బహుళ అష్టమి నాడు చేస్తే అప్పుల బాధలు, శత్రు బాధలు, రోగ బాధలు, గ్రహ బాధలు ,వాస్తు దోషాలు,పితృ దోషాలు ,మాతృ దోషాలు తొలగి పోతాయి. అదే అమావాస్య రోజున ఈ కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన చేస్తే రాజకీయ నాయకులకు పదవి యోగం, వ్యాపార ఆకర్షణ పెరగటం, రాజకీయ రాజయోగం పట్టడం, అఖండ జనాకర్షణ కలగడం, అధికార వసీకరణ కలగటం లాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన చేసుకొని మీరు కోరిన కోరికలు తీర్చుకుంటారు అని ఆశిస్తూ.
మీ అశోక్ కనుమళ్ల
సర్వేజనా సుఖినో భవంతు.
చాలా మంచి వివరణ అందించారు…
🙏 ధన్యవాదాలు…
Good information
అశోక్ గారు శుభ శుభోదయం
వెరీ నైస్ మెసేజి
సో హ్యాపీ to join in the group
Gummadi Kaya gurinchi Baga cheppadu swami
🙏🙏🙏🙏🙏
Nice
Good information Swamy add group
Good information
అందరికీ తెలియాల్సిన విషయాలు.
సూపర్ విషయాలు తెలుపు తున్నారు థాంక్స్
Kani vini aerugani aenno vishayalu maku cheptunnaru
Thank allot
Good information 👍 given sir for thanks allot
Nice
Om kaala byravaya namaha
Good Intermission sir
Om kaala bhairavaaya namaha
Good infermation
Gummadi kaya disti bagundi