కోర్టు (లీగల్) వ్యవహారాల్లో చిక్కులు ఉన్నాయా ?మీరు విద్య లో వెనుక పడుతున్నారా ? కెరీర్లో విజయాన్ని అందుకోలేక పోతున్నారా ?

కోర్టు (లీగల్) వ్యవహారాల్లో చిక్కులు ఉంటే ఈ రెమెడీస్ (remedies) చెయ్యండి.

1. చెరువు మట్టిని (తడిగా ఉన్నది) తీసుకొచ్చి మీ ఇంటి పైకప్పు మీద ఉంచుతూండండి. కోర్టులో వ్యవహార విజయం లభించగలదు .

2. మీ భార్యతో సఖ్యంగా ఉండటమేగాక, ఒక్కో విషయంలో ఆమెని కూడా మాట్లాడనిచ్చి ఆమె అభిప్రాయం కూడా వినండి.

3. పచ్చని శనగలు గుప్పెడు చొప్పున 16రోజులు పారే నదిలో ప్రవహింపజేసి రండి.

4. మన్యుసూక్త పారాయణం చేయించండి కోర్టులో తప్పక విజయం సాధిస్తారు.

5. గురువుని ఎక్కువగా పూజించండి మీకు న్యాయ పరమైన చిక్కులు తొలుగుతాయి. గురువు అంటే సాయి బాబా,దత్తాత్రేయ, వెంకయ్య స్వామి, రాఘవేంద్ర స్వామి అలాంటి వారు.

6. మీకు చదువు చెప్పిన గురువుకు ధన సహాయం కానీ, మాట సహాయం కానీ చేస్తూ ఉండండి.K

మీరు విద్య (Education) లో వెనుక పడుతూ ఉన్నా, కెరీర్లో (career) విజయాన్ని అందుకోలేక పోతున్నా ఈ రెమెడీస్(remedies) చెయ్యండి.

1. పరగడుపున మొదటగా తేనెను ఆహారంగా కొద్దిగానైనా స్వీకరిస్తూ ఉండండి.

2. రాత్రిపూట మీ తల దిక్కున ఓ చెంబుడు నీళ్లు పెట్టుకుని, ఉదయాన్నే ఏదైనా మొక్క/చెట్టు మొదట్లో ఆ నీళ్లు పోసేస్తూ ఉండాలి.

3. స్నానానంతరం సరస్వతి మంత్రం ( మీకు నచ్చింది ) పఠించండి.

4. ఆయుర్వేద దుకాణాల్లో దొరికే సరస్వతీరిష్ఠ టోనిక్ నెల రోజుల పాటు వాడండి. ఇది మెదడుకి శక్తి ని ఇస్తుంది.

5. ఆదిత్య హృదయం నిత్యం పఠిస్తూ ఉంటే కెరీర్లో విజయం తప్పక లభిస్తుంది.

6. రాసే బల్ల మీద పెన్నుల మూతలను తీసి వదలడం ఒక దురలవాటు. ఇలా చేయడం వల్ల పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడుతుంది.K

About Ashok Kanumalla

Ahsok

Check Also

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు …

5 comments

 1. మల్లికార్జున రావు ఊరందూరు

  ఒకే, మంచి విషయాలు తెలిపి నారు.

 2. ధూళిపాళ్ళ రాఘవేంద్రరావు

  మంచి విషయాలను తెలియపరచినావు సంతోషం అశోక్

 3. Court vishayalu superga cepparu

  • అక్షింతల పార్థసారథి

   మరో జన్మ ఉందో లేదో..
   ఉన్నా…..
   ఆ జన్మ లో ఇప్పుడున్న బంధం ఉంటుందో లేదో..
   అందుకే వీలైనంత వరకూ ప్రతీ బంధంలోను ప్రతి క్షణాన్ని ఆనందిద్దాం..
   ఆ మధుర క్షణాలను జ్ఞాపకాలుగా మలచి ఆశ్వాదిద్దాం
   అది ఎంతకాలమైన సరే. మనం కలసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకొందాం.
   వచ్చే జన్మ లో మళ్ళీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా ..!

   శుభోదయం
   చాలా మంచి విషయాలు తెలియ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *