గరుడ పురాణం ఇంట్లో ఉంచి చదువుకోవచ్చా? మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు వేస్తారంటే..

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవచ్చు.

గరుడ పురాణంలో నరకం గురించి, పాపాత్ముల శిక్షల గురించి గరుత్మంతుడు శ్రీ మహా విష్ణుని అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఉంటాయి. దీనిలో ప్రేత కల్పం ఉండటం వల్ల ,అనగా చని పోయిన వ్యక్తికి శ్రాద్ధం ఎలా పెట్టాలి ,పిండం ఎలా పెట్టాలి, ఏ ఏ దానాలు చేస్తే చనిపోయిన వ్యక్తి నరకం వెళ్లకుండా స్వర్గం వెళుతాడు అని, అందుకే ఇంట్లో చదువు వచ్చా లేక చదువకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంది.ఇది మహానుభావుడైన వ్యాస మహర్షి రాసినది.అన్ని పురాణాలు మాదిరి ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు.ఎవ్వరికి అయిన ఈ పుస్తకం ఇవ్వాలంటే హంస బొమ్మతో పాటు కానుకగా ఇస్తే మంచిదని పెద్దలు అంటారు. మీరు ఎవరు అయిన గరుడ పురాణం చదవాలి అనుకుంటే నన్ను సంప్రదిస్తే ఉచితంగా పుస్తకం మీకు ఇస్తాము.

మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు వేస్తారంటే….

 • పరుల ధనాన్ని,పర స్త్రీని ఆశిస్తే చీకటిలో ఉంచి కర్రలతో కొడతారు.
 • స్త్రీల డబ్బును దొంగిలిస్తే నరికిన చెట్ల మీద పడేస్తారు
 • తల్లిదండ్రులను చూడని వాడిని సూర్యుని క్రిందమాడి మసి అయ్యేలా చేస్తారు
 • వావి వరుస లేక సంభోగిస్తే మండుతున్న ఇనుప బొమ్మనుకౌగిలించుకోమంటారు
 • అబద్దాలు చెప్పిన వారిని పెద్ద పెద్ద పర్వతాల మీద నుంచి క్రిందకు తోసేస్తారు

ఇలా ఒక్కక్క పాపం చేసిన ఒక్కో శిక్ష ఉంటుంది.అన్ని శిక్షల గురించి తెలుసు కోవలంటే గరుడ పురాణం తప్పక చదవండి చదివించండి. 84 లక్షల శిక్షలు ఉంటాయి. ఈ పురాణం చదవటం వల్ల మనం ఎంత పాప0 మూటకట్టు కున్నామో తెలుసుకుని ప్రాయశ్చిత్తము చేసుకోవచ్చు.

మనం ఏ పాపం చేస్తే మరల జన్మలో ఏ విధంగా పుడుతాం అంటే….

 • బ్రాహ్మణ హత్య చేస్తే పాండురోగం
 • గోవుని చంపిన మరగుజ్జుగా
 • స్త్రీని హత్య చేసినవారు నిత్యం ఏదో ఒక అనారోగ్యం వచ్చేట్లు
 • మాంసం తిన్న బ్రాహ్మణుడు కుష్టు వ్యాధితో
 • పురాణాలు శాస్త్రాన్ని అవమానించిన క్షయ(TB) రోగంతో
 • అబద్ద సాక్ష్యం చెప్పిన మూగ వాడిగా, అబద్దాలు వినే వాడు చెవిటి వాడుగా
 • వ్యభిచారం చేసే వాడు ఏనుగు గా
 • పిలవని పేరంటానికి వెళ్లిన కాకిగ, స్నేహితుని మోసం చేసిన వాడు గ్రద్దగా
 • భర్తను హింసించే స్త్రీ జలగగా, భర్తను మోసం చేసిన స్త్రీ బల్లి గా
 • గురు పత్ని తో సంభోగం చేస్తే తొండగా
 • అతి కామం గల వాడు గుర్రంగా
 • భార్యను హింసిస్తే మేకగా పుడతారు
 • అని గరుడ పురాణం చెబుతుంది.

సర్వే జన సుఖినో భవంతు..

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

16 comments

 1. Raja Ramesh Reddy.Bandi

  Excellent information

 2. ఆలేటి హరి

  మంచి విషయాలు అందరికి ఉపయోగం

 3. Excellent 👍👌

  • అక్షింతల పార్థసారథి

   సూపర్ చాలా బాగుంది మీ మెసేజ్ థాంక్యూ

   గుడ్ ఆఫ్టర్నూన్ అశోక్ గారు

 4. Good information

 5. మోహన్ కిషోర్ నిమ్మా

  చాలా మంచి విషయం చెప్పారు ఇది ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం దాన్ని తొలగించి మంచి వివరణతో కూడుకున్న సమాధానం ఇచ్చారు ధన్యవాదాలు సార్ మీరు ఎవరికైనా ఈ పుస్తకాలు కావాలంటే చెప్పండి మీరే ఇస్తాను అన్నారు చాలా సంతోషం మీకు నా హృదయ
  పూర్వక 🙏🙏🙏

 6. Jagadeesh Kumar

  Good Information

 7. Good information

 8. Good information Excellent 👌👌

  • Padarthi Balaji

   చాలా చక్కగా అందరకి తెలియనవి మీరు తెలియజేసినందుకు థన్యవాదములు

 9. Good information

 10. Meru ilanti amulyamaina vishayalanu andariki andachestunnanduku dhanyavadalu

 11. Pustakam kuda istanannaru
  Meru chala goppavaru

 12. Pannala SVSVG Manikya Srinivasa Sarma

  garuda puranam intilo vunchukuni chaduvukovalani appati nuncho naaku korika.
  మీరు ఎవరికైనా ఈ పుస్తకాలు కావాలంటే చెప్పండి మీరే ఇస్తాను అన్నారు చాలా సంతోషం .
  dayachesi naaku sarafara cheyagalaraa?

 13. Pannala SVSVG Manikya Srinivasa Sarma

  సార్ మీరు ఎవరికైనా ఈ పుస్తకాలు కావాలంటే చెప్పండి మీరే ఇస్తాను అన్నారు చాలా సంతోషం
  dayachesi naaku andacheya galaraa?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *