చేతబడి చేస్తే ఏం జరుగుతుంది ?

చాల మంది చేతబడి అన్న మాట వింటేనే  భయపడుతుంటారు, ముందు అసలు చేతబడులు ఉన్నాయో లేదో తెలుసుకుందామ..

ఇంతకు ముందు గ్రామాలలో వైద్య సదుపాయం సరిగా ఉండేది కాదు. అందువలన వారికి ఏ విధంగా నైనా అనారోగ్యం వచ్చి సన్న బడి, ఆహారం తినటం ఇష్టం లేక పోయినా, రాత్రి నిద్ర పట్టక ఏవేవో ఆలోచనలతో ,లోపల అనుకోవాల్సిన మాటలు బైటకు పెద్దగా అంటున్నా , అనారోగ్య కారణంగా శారీరక పరిశుభ్రత పాటించక పోయిన చేతబడి చేశారు అనుకునే వారు.

అదీగాక ఆ రోజులలో గ్రామాలలో పెద్దగా చదువుకునే వాళ్ళు కాదు. పట్టణాలలో దీనినే “న్యూరోసెస్ “వ్యాధి అని డాక్టర్స్ అంటారు. విద్యాలేని వాళ్ళు , అమాయకులు, ఇబ్బందుల్లో బాగా చితికి పోయిన వారు ఇలాంటివి నమ్మి భూత వైద్యులకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వారు తొందరలోనే మీ వారికి మరణం వస్తుంది చేతబడి తీయించాలి అని డబ్బులు గుంజుతారు.

ఇంకా మన శత్రువులను చంపుతాము అని చెప్పి, వాళ్ళ వెంట్రుకలు, గోళ్లు, వాళ్ళు వాడిన దుస్తులు తెండి అని చెప్పి, ముగ్గులు వేసి ఆ ముగ్గులో ఒక పిండి బొమ్మను పెట్టి దానికి సూదులు గుచ్చి ఏవేవో మనకు అర్థం కాని మంత్రాలు చదివి , దీనిని వాళ్ళ ఇంట్లో పూడ్చి పెట్టండి వాళ్లకు తెలియకుండా అని చెప్పి డబ్బు తీసుకుంటారు. మరల ఆ పూడ్చి పెట్టిన వారి ఇంటికి మనిషిని పంపి మీ ఇంట్లో ఎవరో మీకు చేతబడి చేశారు అని చెప్పి, వాళ్ళు పెట్టిన దాన్ని తీసి మల్ల డబ్బు గుంజుతారు.

క్రీ.శ. 14నుంచి 16 వ శతాబ్దం మధ్యలో విదేశాలలో అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, కొరియా లలో 90 లక్షల మంత్రగాళ్లను  చంపి వేయటం జరిగింది.నిజంగా చేతబడులు ఉంటే రాజకీయ నాయకులు, మంత్రులు రోజు ఎంతో మంది చని పోయేవారు. ప్రపంచంలో ఎక్కడ హత్యలు అనేవి లేక కేవలం చేతబడి తో చంపేసి చట్టానికి దొరక కుండా ఉండేవాళ్ళు. ఫ్యాక్షన్ అసలు ఉండేది కాదు. పాకిస్తాన్, చైనా లాంటి వారితో తుపాకులు, బాంబ్స్ , విమానాలతో యుద్ధం చెయ్యకుండా చేతబడి చేసి చంపేసే వాళ్ళెగా ?

అనుమానమే మనిషిని సగం నాశనము చేస్తుంది. నమ్మకమే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి చేతబడులు అనేవి ఎప్పుడు ఎక్కడ లేవు అనేది నిజం, కనుక మీరు ఏమి అంటారు ఫ్రెండ్స్…….

 

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

14 comments

 1. Nice valuable information

 2. Akshi ntala. Sakuntala

  Iife is nothing
  When we get everything

 3. అశోక్ దేవరకొండ

  Yes నిజం sir

  • అక్షింతల పార్థసారథి

   Very good msg
   సమస్త సన్మంగళాని భ వంతు
   ఓం నమో గణేశాయ
   శుభమస్తు

 4. A ,minikrishna

  andhari kallu teripincharu sar

 5. బాగా చెప్పారు అన్న గారు

 6. Nice valuable words

 7. Conclusion is morwoless

 8. Conclusion adhbutamga undi

 9. Dhulipalla raghavendrarao

  You will send new valuable articels santhosham

 10. very good infermation…

 11. Correct

 12. Very inportent matter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *