జాతకం లేని వారికి శాంతులు

Horoscope Predictions
Horoscope predictions in Telugu

ఈ శీర్షిక జాతకం లేని వారికి చాలా ఉపయోగపడుతుంది. అంటే పుట్టిన సమయం లేని వారికి. కానీ జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును.

 

1. ఆదిత్య హృదయం: ఇది సూర్యునికి సంభందించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున చదువట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐ స్వర్యాలను పొందుతారు. మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది.పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుండి, దుఃఖాలనుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పఠించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాదించాడు.

ఆదిత్య హృదయం chadavalante click cheyandi

2. రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం: జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే “రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం” నలుబై ఒక రోజులు పారాయణ చేస్తూ ,నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరి రోజు కందులు,ఎర్ర గుడ్డ,డబ్బులు దక్షిణగా పెట్టి,కుజునకు మీపేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.

3. మీకు వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ, అప్పులు వసూలుకాకుండా ఉండటం జరుగుతోందా? అయితే మీరు “విష్ణు సహస్ర నామ స్తోత్రం” 41 రోజులు పారాయణ చెయ్యండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేయించండి. మీ భాదలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

4. మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా? ఐతే మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు “సర్ప దోష నివారణ పూజ” చేయిన్చండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేయించండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేయిస్తే ఇంకా మంచిది. (లేదా)” సంతాన గోపాలకృష్ణ వ్రతం” నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.

5. వివాహం ఆలస్య మవుతోందా? ఐతే మీరు రుక్మిణి కల్యాణం పారాయణ చెయ్యండి. (లేదా) 41 రోజులు ,రోజుకి నలుభై ఒక్క ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చెయ్యండి.ఐతే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.

6. ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? ఐతే ధన కారకుడైన సాయి బాబా పారాయణ నలుభై ఒక్క రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు,అరటి తొక్కలు,ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. నలుభై ఒకటవ రోజు బూంది ఒకకిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.

7. డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ: ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు “ఏకన్యాస రుద్రాభిషేకం” చెయ్యండి. అలాగా ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయించండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి.

8. ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ “శ్రీ సూక్తము పారాయణ చేయవలెను.

9. హనుమాన్ చాలీసా : హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం “హనుమాన్ చాలీసా”. ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిరి. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు పదకొండు పర్యాయములు చొప్పున మండలం(40 రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని 108 పర్యాయములు పఠించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ 3 వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.

About Ashok Kanumalla

Check Also

కట్నం కన్యాశుల్కం తీసుకోవచ్చా?

త్రేతాయుగం నుండే ఈ కన్యాశుల్కం, వర దక్షిణ అంటే (కట్నం) ఇవ్వడం ప్రారంభమయ్యాయని ,5000 సంవత్సరాల నుండి బాగా వాడుకలోకి …

11 comments

 1. Raja Ramesh Reddy.Bandi

  Good news for optimistic people

 2. K. Sreenivasulu

  Good news Ashok gaaru 🙏👍👌👌

 3. అక్షింతల పార్థసారథి

  బాగుంది మెసేజ్
  అశోక్ గారు

 4. మోహన్ కిషోర్ నిమ్మా

  అన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి విషయాలు తెలియజేశారు సార్

 5. Good news and gud msgs for people 👍👌👌🙏🙏

 6. చాలా విలువైన సమాచారం ఇచ్చారు అన్న గారు

  • చాలామంది కి తెలియని విషయాలు చెప్పి నందు కు సంతోషంగా ఉంది

  • Padarthi Balaji

   చాలా మంచి విషయాలను తేలియజేసి నందుకు మీకు థన్యవాదములు

 7. Akshi ntala. Sakuntala

  Super msg

 8. Jeevita anubhavalaku sambandinchina ikkatlu
  Mariyu vati upasamana margala gurinchi chala chakkaga vivarinchi maku teliyachesaru
  Meeku memu nto runapadi unnamu

 9. మాకు జీవితంలో మీ లాంటి గురువు గారు ఉండటం మా పూర్వ జన్మ సుకృతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *