Breaking News

జ్యోతిష శాస్త్రాన్ని నిజంగా నమ్మవచ్చా ? జ్యోతిష శాస్త్రం ప్రకారం శాంతులు చేసుకుంటే భవిష్యత్తు మారుతుందా ?

 

జ్యోతిష్య శాస్త్రం మూలంగా మనకు జరగబోయే చెడును తప్పించుకొని, మంచి జరిగేటట్లు చేసుకోవచ్చు. సంతానం, ఆరోగ్యం, ఆయుష్షు, ధనం,వృత్తి, పెళ్లి ఇలాంటి విషయాల గురించి తెలుసుకొని ముందు జాగ్రత్త తీసుకోవచ్చు.

మనిషికి తెలిసిన అన్ని శాస్త్రాలలోకి జ్యోతిషం గొప్పది. పుట్టిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడిటిని బట్టి మనిషి వ్యక్తిత్వం, జీవితంలో జరుగబోయే సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు ఏ ఇతర సైన్సు ఇపుడు చెప్పలేదు. జీవితంలో ఎన్ని సాధించినా మనిషికి తెలియంది భవిష్యత్తు మాత్రమె. దానిని స్పష్టంగా చూపించే విద్య జ్యోతిషం మాత్రమే.

సైన్స్ ఎప్పుడో వచ్చే గ్రహణాలు ఇపుడు చెప్పగలదా? కానీ ఎప్పుడో 100 ఇయర్స్ తర్వాత వచ్చే గ్రహణాలు గురించి జ్యోతిశాస్త్రం ఇపుడే చెబుతుంది.అటువంటప్పుడు జ్యోతిశాస్త్రం నమ్మ వచ్చా అని అడగటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.

జరిగేది ఎలాగూ జరుగుతుంది, జ్యోతిషం ఎందుకు అన్న ప్రశ్న ఈ నాటిది కాదు. చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది. భట్టోత్పలుడు వరాహుని గ్రంధాలకు, పృధు యశస్సు గ్రంధాలకు వ్యాఖ్యాత. ఈయన ఈ విషయాన్ని వివరంగా చర్చించాడు. ముందు జరుగ బోయేవి తెలుసుకుంటే మార్చుకునే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అసలు జ్యోతిష ప్రయోజనం జరుగబోయే చెడును తొలగించుకోడమే. దానికి అవకాశముందా అన్నది ప్రశ్న?భవిష్యత్తును మార్చుకునే అవకాశం తప్పక ఉంది.

అవకాశమే లేకుంటే జ్యోతిష విద్యకు అర్థమే లేదు. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మనం అనుభవించే మంచి, చెడు రెండూ మనము పూర్వ జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరియైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితం మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది. అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మన ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము.

కర్మ మూడు రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించ గలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.

మనిషి జీవితంలో పశ్చాత్తాపానికి ఎప్పుడూ అవకాశం ఉంది. చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం భగవంతుని సృష్టిలో ఉంటుంది. అయితే శాంతులు అనేవి తూతూ మంత్రంగా చేసి తరువాత మళ్ళీ మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అంటే కుదరదు. చిత్త శుద్ధితో, చేసిన పాపాలకు నిజమైన పశ్చాత్తాపం తో భగవంతుని వేడుకుంటూ శాంతులు మనస్పూర్తిగా చేస్తే తప్పక అవి ఫలితాన్ని ఇస్తాయి. చాలా సార్లు ఫలితాలు వెంటనే కనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇది ఎన్నో సార్లు రుజువైంది.కాకుంటే రెమెడీస్ చెయ్యడం చాలా కష్టం.

తేలికగా కనిపించే రెమెడీస్ కూడా ఒక పట్టాన లొంగవు. చెయ్యటానికి బుద్ధి పుట్టదు. పుట్టినా అనేక అవాంతరాలు కలుగుతాయి. మధ్యలో మాని వేయాల్సిన పరిస్తితులు తలెత్తుతాయి. వీటన్నిటికీ తట్టుకొని నిర్ణీత కాలం వరకు చెయ్య గలిగితే తప్పక దోషాలు తోలగుతవి. జ్యోతిషం మణి, మంత్ర, ఔషదాలను రేమేడీలుగా సూచించింది. ఇవే గాక తాంత్రిక రేమేడీలు ఉన్నాయి. సులభంగా కనిపిస్తూ చేసేటప్పుడు నానా బాధలు పెట్టె లాల్ కితాబ్ రేమేడీలు ఉన్నవి.

వాస్తవంగా జ్యోతిషం నిరాశావాదం కాదు. ఇది జీవితం మీద ఆశను పెంచే అద్భుత శాస్త్రం. ఏదో కొందరు జ్యోతిష్యులు చెప్పిన ఫలితాలు జరగలేదని అందరూ జ్యోతిషులను నిందించడం సరికాదు. కాబట్టి మంచి అనుభవం ఉన్న జ్యోతిషులకు మీ జాతకాన్ని చూపించుకొని శాంతులు ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చు.మార్చుకుంటారు అని ఆసిస్తూ…

మీ
అశోక్ కనుమళ్ల

సర్వేజనా సుఖినో భవంతు

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

17 comments

 1. Wonderful Explanation…

 2. అక్షింతల పార్థసారథి

  Good morning

  Excellent Ashok

  Meeku hats off

 3. Excellent

 4. Wow superr explanation given sir Tq

 5. Akshi ntala. Sakuntala

  Ok B r TQQQQQQ

  Very nice

 6. మల్లికార్జున రావు ఊరందూరు

  Yes correct

 7. Excellent 👍

 8. Nijamga namma vachu ayite

 9. Kachitamga jotishyaanni Namma vachu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *