తాబేలు ఇంట్లోకి వస్తే అరిష్టమా? తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధనవంతులు అవుతారా?

tortoice photos
తాబేలు ఇంట్లోకి వస్తే అరిష్టమా? తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధనవంతులు అవుతారా?

ఇంట్లో మీకై మీరు తాబేళ్లను పెంచడంలో తప్పులేదు. కానీ తాబేలు దానంతట అదే ఇంట్లోకి ప్రవేశిస్తే అపశకునమే. తాబేలు ప్రవేశించిన వెంటనే ఆ ఇంట్లో వాళ్లకు ఇబ్బందులు తప్పవు. ఇంకా ఆ ఇంటి యజమాని ఆ ఇంటిని ఖాళీ చేసి వేరొక ఇంటికి వెళ్లడం మంచిది. అయితే అదే ప్రాంతంలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.  వాస్తు దోషాలను తొలగించుకోవాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. అలా పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. కానీ వాస్తు నిపుణులు మాత్రం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే.. వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు.

చైనా వాస్తు అని పిలువబడే ఫెంగ్‌షుయ్ పద్ధతిలో తాబేలు ఎలా తన 5 అవయవాలను (తల, నాలుగుకాళ్లను) ఎలా లోనికి లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో, అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఆయుర్దాయం, శుభాలకు సంకేతంగా చెప్పబడుతోంది. అందుకే లోహంలో తయారు చేయబడిన తాబేలును.. నీటితో నింపిన బౌల్‌లో వుంచి ఇంట్లో ఉత్తర దిశలో వుంచాలి.

 

tortoice pictures
తాబేలు ఇంట్లోకి వస్తే అరిష్టమా? తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధనవంతులు అవుతారా?

మీ ఇంట్లో ఉత్తర దిశలో పడకగది వున్నట్లైతే నీరు లేని లోహంతో తయారైన తాబేలును వుంచవచ్చు. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు, ఆర్థికాభివృద్ధి, శత్రుభయం, శత్రుదోషాలు, నరదృష్టి, అసూయ, ఈర్ష్య ప్రభావం మనపై వుంటే తొలగిపోతుంది. తాబేలు మాత్రమే కాకుండా, తాబేలు లాంటి కూర్మావతారం వంటి శంఖం, కామధేనువు, కల్పవృక్షం, శమంతకమణి, ఐరావతం వంటివి వాస్తు దోషాలను తొలగిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెప్తున్నారు

ఈ బొమ్మను రంగుల రాళ్లతో నింపిన నీటిలో వుంచాలి. తాబేలు పాదాలు నీటిలో మునిగేలా ఈ బొమ్మను వుంచాలి. ఇలా చేస్తే ఆ ఇంట ప్రశాంతత, సామరస్యం, శాంతి, దీర్ఘాయుష్షు, ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది

 

tortoice images
తాబేలు ఇంట్లోకి వస్తే అరిష్టమా? తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధనవంతులు అవుతారా?

రెసిన్లు, మెటల్, గ్లాస్, స్ఫటికాలు, చెక్కలతో చేసిన తాబేలు బొమ్మల్ని షాపుల్లో అమ్ముతారు. ముఖ్యంగా లోహాలలో చేసిన బొమ్మను ఇంట్లో లేదా ఆఫీసుల్లో వుంచితే.. శత్రువిజయం వుంటుంది. క్రిస్టల్‌లో చేసిన తాబేలు బొమ్మను.. నైరుతి లేదా వాయువ్యంలో వుంచటం మంచి ఫలితాలను ఇస్తుంది.

తాబేలు ఉంగరం ధరిస్తే ఎవ్వరైనా ధనవంతులవుతారా?

 

tortoice latest pics
తాబేలు ఇంట్లోకి వస్తే అరిష్టమా? తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధనవంతులు అవుతారా?

జాతక చక్ర ప్రకారం మనం రక రకాల రత్నాలైన పగడాలు,రత్నాలు,వజ్రాలు ధరిస్తూ వస్తున్నాం. కానీ ఇపుడు వాటి కన్నా అద్భుతమైన తాబేలు ఉంగరం గురించి చెప్ప బోతున్నాను. రత్నాల ఉంగరాలు ఒకరికి ఒక్కో రకం పడుతుంది. కానీ ఈ తాబేలు ఉంగరం మాత్రం ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. ఈ తాబేలు ఉంగరం ధన ప్రాప్తి కోసం, మానసిక ఆందోళనల నుండి బయట పడటానికి, నెగటివ్ ఎనర్జీ నుండి పాసివ్ ఎనర్జీ పొందే దానికి పెట్టుకోవాలి. తాబేలు నీటిలో వుండే ప్రాణి, ఇది పోసిటివిటీకి చిహ్నం. ఇది విష్ణు మూర్తి అవతారం, సముద్రం నుండి పుట్టింది, లక్ష్మి దేవి కూడా సముద్రం నుండి ఉద్బవించింది. అందుకే ఇంట్లో తాబేలును పెట్టుకోవటం, లేక వుంగరంగా ధరించటం ఎంతో శుభదాయకంగా భావిస్తున్నారు. అవును ఈ తాబేలు ఉంగరం ధరిస్తే ఎప్పుడు ధన హాని జరుగదు. పనులన్నీ నెరవేరుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం దైర్యం ,ధనప్రాప్తి నియంత్రణ కలిగిస్తుంది .దీనిని ధరించుట మూలంగా మనిషిలో ఆత్మ విశ్వాసం మరియు శక్తిని నింపటానికి సహాయ పడుతుంది. ఈ ఉంగరాన్ని కుడి చేతి చూపుడు వేలుకి ధరిస్తే మంచిది. లక్ష్మి దేవి కి శుక్రవారం అంటే ఇష్టం కనుక తాబేలు ఉంగరాన్ని శుక్రవారం ధరిస్తే మంచిది. తాబేలు తలా పైకి అంటే ధరిచేవాళ్ల వైపు వుండేటట్లు ధరించాలి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

16 comments

 1. Excellent clarification…

  Thanks…👌🙏

 2. Good information…. I suggest to start a youtube channel .

 3. Super. Clarification ichaaru Dhanyavadhamulu

 4. Raja Ramesh Reddy.Bandi

  Good information
  👌🙏👌🙏

 5. మోహన్ కిషోర్ నిమ్మా

  అన్న తాబేలు గురించి విషయాలు చాలా తెలియజేశారు

 6. Super massage

 7. అక్షింతల పార్థసారథి

  Good evening Ashok Kumar

  సూపర్ గా ఉంది మెసేజ్

 8. Ok nenu cheyinchukuntaanu

 9. Wow wonderful message

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *