తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి ?తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయి?

 

తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి ?

అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉంది ఈ పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూల బావి లో పడేస్తారు. ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామి వారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడు చూసి శ్రీమహా లక్ష్మి సిగ్గుతో శ్రీమహా విష్ణువు వక్షస్థలంలో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ.

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయి?

శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి అవి కాలంతోపాటు అరుగుతున్నాయి. దానికి కారణం శ్రీ వేంకటేశ్వరునికి భార్యపై ప్రేమ ఎక్కువ. శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తరువాత ఈ పాదరక్షలు ధరించి, ఏడుకొండలునుదిగి అలమేలు మంగాదేవి వద్దకెళ్ళి మళ్ళీ ఏడుకొండలు ఎక్కి తన యథాస్థానానికి సుప్రభాత వేళకి చేరుకుం టాడు. అందుకే అవి అరిగి పోతుంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

8 comments

 1. Raja Ramesh Reddy.Bandi

  Ohm namo venkatesaya
  🙏🙏🙏🙏🙏

 2. తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి ?తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయి? వాటి
  గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

 3. చాల మందికి తెలియని విషయాలు తెలుపుతున్నారు ధన్యవాదాలు

 4. Nice information sir

 5. Good information 👍 and wonderful topic explained Tq verymuch super

 6. మాకు తెలియనవి మీరు మాకు తెలియజేసినందుకు మీకు థన్యవాదములు అన్నగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *