పేదవారికి, అనాదలకు, అభాగ్యులకు దానం చేయడం వలన మనకున్న కష్టాలు తీరి, ఆనందమయ జీవితం గడుపుతాము.కానీ పురాణాలు శాస్త్రాల ప్రకారం పేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.అయిన మన స్తోమతకు తగ్గట్టుగా దాన ధర్మలు చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు.ఈ క్రింద ఉన్న దానాలలో మీరు చేయగలగినవి చేసుకోండి.
1. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి.
2. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది.
3. బంగారుని దానం చేస్తే దోషాలు తొలగుతాయి.
4.పండ్లను దానంచేస్తే బుద్ధి,సిద్ధి కలుగుతాయి.
5. పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యం గా ఉంటారు.
7. పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు.
8. తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది.
9.ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.
10. టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.
11. దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది.
12.గోదానం చేస్తే ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది.ఈశ్వరలోక దర్శనం కలుగుతుంది.
14. వస్త్ర దానం చేస్తే ఆయుషు పెరుగుతుంది.
15. అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి .ధనవృద్ధి కలుగుతుంది.
మీ
అశోక్ కనుమళ్ల
సర్వేజనా సుఖినో భవంతు
Excellent…
Nice 👍 Tq
సూపర్ గా చెప్పారు
వెరీ హ్యాపీ న్యూస్
మీలాంటివారు మాకు
చాలా అవసరం
ఆ భగవంతుడు నీకు
ఆయు రారోగ్యాలు
ప్రసాదించాలని కోరుకుంటున్నాను
అశోక్ కుమార్ గారు
Nice information 👌👍
👍👍👍👌👌👌
Good information
చాల బాగా చెప్పారు దానాల గురించి సంతోషంగా ఉంది
Meru spr excellent amogham adhbutam
Grate
Ilanti chinna chinna vishayalu kuda maku cheptunnaru