దాన ధర్మ పరుడైన మనిషికి స్వర్గ లోకం, మోక్షము సిద్ధిస్తాయా ?

నీకు వున్నదానిలో కొంతభాగం లేనివారికిచ్చి సహాయపడమని వేదం.

స్మృతులు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. పురాణాలు – ఇతిహాసాలు కూడా దానగుణానికి మించిన దైవత్వం లేదనీ, ధర్మాన్ని రక్షించమని బోధిస్తాయి.

కృతయుగంలో తపస్సు – త్రేతాయుగంలో ఆత్మజ్ఞానం – ద్వాపరయుగంలో యజ్ఞయాగాలు, కలియుగంలో దానధర్మాలు గొప్పవని పరాశర సృతి చెబుతోంది. దాన ధర్మ పరుడైన మనిషికి స్వర్ణ లోకం మోక్షము సిద్ధిస్తాయని భవిష్యపురాణం చెబుతున్నది.

ధర్మాన్ని నీవు కాపాడ గలిగితే ధర్మం నిన్ను కాపాడుతుంది.ధర్మానికి నీవు హానిచేస్తే నిన్ను నాశనం చేస్తుందని మనుస్మృతి చెబుతోంది. శ్రీకృష్ణుడు గీతోపదేశంలో కూడా ఇదే విషయం చెబుతాడు.

దాన ధర్మం వలన పుణ్యం వస్తుందా! స్వర్గ లోకంలో నాకు సింహాసనం లభిస్తుందా! అనే ఆలోచన కన్నా, మానవతా దృష్టితో, వివేచనా ధర్మంతో ఆలోచించవల్సిన దొకటుంది. “లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు”

లక్ష ఎకరాలున్న భూస్వామి అయినా తినేది గుప్పెడు మెతుకులే గదా. పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో మనకు సంపదలు లభించి వుండవచ్చు అదృష్టదేవత కరుణించి వుండవచ్చు. పది తరాలవారికి సరిపడేటంత సమృద్ధి వుండి వుండవచ్చు. కాని నీవు మనిషివి. వివేకం కల్గినవాడివి. ఆలోచించగలబుద్ధి వున్న ప్రాణివి నీతోటి మనిషి, నీతోపాటు నీ సమాజంలో జీవిస్తున్న మనిషి ఆకలిబాధతో అలమటిస్తూ “అమ్మా” అని కేకవేస్తే స్పందించాల్సిన అవసరం నీకు లేదా పశువులు పక్షులు కలిసి ఆహారాన్ని పంచుకొంటాయి. అంతమాత్రం అభిమానం నీ సమాజంలోని నీ మనిషిమీద నీకు వద్దా? ఏడంతస్థులమేడ నీకున్నా నీవు పరుండే స్థలం మాత్రం చిన్నదే కదా.

మానవతా హృదయం నీకు లేకుంటే నీవెంతటి ధనవంతుడైన ప్రయోజనా శూన్యం . దేవుడికిచ్చే కానుక కన్నా , దానం చేసే పైసా మిన్న. దానధర్మాలవల్ల పుణ్యం వస్తుందో రాదోగాని నీగుండెలోనుండి ప్రేమతత్వం వస్తుంది.

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

13 comments

 1. Correct 👍👍👍👍👍👍

 2. దాన, ధర్మాల గురించి అశోక్ స్వామిజీగారు
  చాలా బాగా చెప్పారు స్వామిజీగారికి
  ధన్యవాదాలు

 3. Raja Ramesh Reddy.Bandi

  One should have this type of generous heart towards the needy people.
  Well said.
  👍👌👍👌🙏

  • అక్షింతల పార్థసారథి

   ఎవరైనా మంచి మాటలు

   చెప్పినప్పుడు గ్రహించాలి

   మంచి విషయాలు చెప్తున్నారు

   శుభరాత్రి కుమార్

 4. Yes absolutely correct sirsimhasanam కోసం kaakapoyinaa maanavatha drusti tho cheyyadam . excellent 👌 👌 msg

 5. Good impermation

 6. Nice information

 7. Good massage

 8. Nice 👍👌🙏

 9. మల్లికార్జున రావు ఊరందూరు

  మంచి విషయాలు తెలియజేస్తూ…….ఉన్నారు

 10. Good information

 11. Akshi ntala. Sakuntala

  Super very good

  important information

  Thanks B r

 12. Excellent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *