దేవునికి స్నానం చేయకుండా పూజ చేయకూడదా ?ఎందుకు చేయకూడదు ?

శరీర మాలిన్యాలను తొలగించేది స్నానం. స్నానమనేది శుచి శుభ్రతల సంకేతమే గాని పవిత్ర కార్యం కాదు. పూజ చేయడానికి స్నానం చేయటానికి సంబంధం లేదు. కాని స్నానం చేసిన తరువాతనే పూజ చేయటంలో ఒక అంతరార్థం వుందని చెప్పవచ్చు! మామూలు స్నానం కానీ, శిరస్నానం కానీ అభ్యంగన స్నానం కాని చేసిన తర్వాత శరీర మాలిన్యాలన్నీ తొలగింపబడి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

“ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ది లేని పాకమేల చిత్తశుద్ధిలేని శివపూజలేలరా దేవుడు కానుకలకు, దొంగపూజలకు లొంగడు”అన్నాడు యోగి వేమన. ఒకవేళ లొంగితే వాడు దేవుడే కాదు, అటువంటి దేవుడ్ని పూజించ నక్కర్లేదు.

వైదికమతం భారతదేశంలో పుట్టి 3000 సంవత్సరాలకు పైగా అయింది. పండితు లైన వైదిక గురువులు హిందువులను, కోతులు ఆడించినట్లుగా ఆడించారు. చిత్రవిచిత్ర ఆచారాలు పుట్టించి హిందూ మతాన్ని నాశనంవైపుగా నడిపించారు. వృత్తి ప్రాదిపదికగా ఏర్పడ్డ వర్ణా శ్రమ ధర్మం క్రమ క్రమంగా వెర్రితలలు వేసింది ఫలితంగా కులాలు పుట్టాయి. మనకు కులాలు పుట్టి దాదాపుగా రెండున్నరవేల సంవత్సరాలు అయింది. హిందూమతంలో ఎపుడు కుల వ్యవస్థ వచ్చిందో అప్పుడే మతపతనం ప్రారంభం అయింది. హిందువుల ఐక్యత పోయింది. అన్న దమ్ములుగా జీవించవల్సిన హిందువు లందరూ కులాల చిచ్చు కొట్టుకోవడం మొదలైంది హిందువులు మూడు వేల కులాలు విడి పోయారు. అర్థం పర్ధం లేని ఆచారాలు పుట్టాయి వేలకువేలుగా దేవుళ్ళు సృష్టించబడ్డారు వేదాలను, వేదసంప్రదాయాలను మర్చిపోయాము.చిల్లర దేవుళ్ళకు పూజ చేస్తున్నారు పిచ్చిపిచ్చి ఆచారాలను పాటిస్తున్న ఎప్పుడైనా విచారవంతమైన ఆచారమే సదాచారం.

.

దైవ పూజకు కావలసింది అలంకరించుకొన్న దేహం కాదు! అంకితభావంగల మనస్సు కావాలి పరమాత్ముని పూజకు ముఖ్యమైంది మనస్సు దేవుడు ఆడంబర పూజలను అంగీకరించడు భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ఇదే విషయం చెబుతాడు దేవుని హృదయ కమలంతో పూజించాలేగాని డాబుదర్పాలతోనూ ధూప దీపాలతో నేతిప్రసాదాలతోనూ కాదు. అందుకని మనస్సు దేవుని మీద లగ్నం కావాలె గాని శరీర శుభ్రత కాదు.

సర్వేజనా సుఖినో భవంతు

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

12 comments

 1. Good information

  • చాలా మంచి విషయాలు తెలిపారు సర్ మీకు ధన్యవాదాలు

 2. అక్షింతల పార్థసారథి

  సూపర్ అశోక్ కుమార్ గారు

  మీరు చెప్పిన విషయాలు

  బాగున్నాయి మంచిగా చెప్పారు

 3. Nice information given sir Tq very much

 4. Raja Ramesh Reddy.Bandi

  Each and every individual should know this..
  Thank you very much..
  🙏🙏🙏🙏🙏

 5. చాల చక్కగా వివరించారు దేవుని పూజ గురించి థన్యవాదనలు

 6. పూజలు వాటి విధి విధానాలు మరియు సంప్రదాయ పద్ధతులు గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

 7. Super

 8. Good information Ashok sir

 9. మల్లికార్జున రావు ఊరందూరు

  కాలుష్య సమాజ ధోరణి వల్ల…..

 10. Kachitamga patinchalsina vishayalu chepputunnaru
  Spr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *