దేవుని పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమా ?

ముందుగా మనం కొబ్బరి కాయనే దేవునికి ఎందుకు కొట్టాలి తెలుసు కుందాము. మంచి నీరు , ఉప్పు నీరు ఉన్న ప్రదేశాల్లో కూడా కొబ్బరి నీరు తియ్యగా ఉంటుంది. ఆహారంగా, ఆరోగ్యం కోసం ఇది బాగా ఉపయోగ పడుతుంది కాబట్టి.

 

ముందుగా మనం కొబ్బరి కాయనే దేవునికి ఎందుకు కొట్టాలి తెలుసు కుందాము. మంచి నీరు , ఉప్పు నీరు ఉన్న ప్రదేశాల్లో కూడా కొబ్బరి నీరు తియ్యగా ఉంటుంది. ఆహారంగా, ఆరోగ్యం కోసం ఇది బాగా ఉపయోగ పడుతుంది కాబట్టి.

ఎలాగంటే కొబ్బరి నీరు అన్ని అనారోగ్యాలు తగ్గించి, చలువ చేస్తుంది. కొబ్బరి నూనె ఆహారంలో ,మరియు తలకి వాడితే చాలా మంచిది కద. కొబ్బరి చెట్టు కి సంబందించిన ప్రతి వస్తువు మనకు ఉపయోగ పడుతుంది. ఇలాంటి చెట్టు ఇంకోటి లేదు అనేది పూర్వీకుల అభిప్రాయం. అది గాక కొబ్బరి రోజు తింటే తెలివి తేటలు, చాకచక్యం, జ్ఞాపక శక్తి పెరుగు తుంది అని ఆయుర్వేదం చెబుతుంది.ఇది అందరూ తినటానికి పెద్ద ఇష్ట పడరు కాబట్టి ఋషులు దేవుని కార్యాలకు వాడి ప్రసాదం గా పెట్టేవారు అపుడు వద్దు అనకుండా తింటాం కదా.

ఇక అసలు విషయానికి వస్తే కొబ్బరికాయ కుళ్ళితే దోషం , అపచారం ఏమి కాదు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. కొబ్బరికాయ తెల్లగా కుళ్ళితే , అది పండినట్టు లెక్క .అపుడు మనం అనుకున్న పని త్వరలో జరగబోతోంది అని అర్థం.కొన్ని సార్లు కొబ్బరికాయలో పువ్వు ఉంటుంది అది ఇంకా శుభ సూచకం అతి త్వరలో మన ముఖ్యమైన కోరిక తీర బోతోంది అని అర్థం. ఇక రెండో రకం నల్లగా కుళ్ళితే వెంటనే ఆ కాయను నీటితో శుభ్రం చేసి ,పక్కన పెట్టి ఇంకో కొబ్బరికాయను దేవుడికి కొడితే సరిపోతుంది. అది మనం తెలిసి చేసిన పని కాదు కాబట్టి మనకు ఏ అరిష్టం జరుగదు.

అలాగే ఇంట్లో పూజ చేసేటపుడు కొబ్బరి కాయ కుళ్ళితే ,ఆ కాయను తీసేసి పూజ మందిరాన్ని కడిగి, కాళ్ళు చేతులు కడుక్కొని, మళ్ళీ ఇంకో కాయను కొట్టడం మంచిది. అందుకే ఎప్పుడు దేవుడి దగ్గర ఇంట్లో కొట్టేటపుడు 2 కాయలు తెచ్చుకుంటే మంచిది. గుడి దగ్గర అయితే రెండో కాయ దొరుకుతుంది. ఇంటి దగ్గర దొరకదు కదా. వాహనాలు కొన్నపుడు పూజ చేసేటపుడు కొబ్బరికాయ కుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే లెక్క. అయిన సరే మరల వాహనాన్ని కడిగి పూజ చేసుకుంటే మంచిది.

సర్వే జనః సుఖినో భవంతు….

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

18 comments

 1. K. Sreenivasulu

  Good

 2. అక్షింతల పార్థసారథి

  Very good msg
  Good morning

 3. మంచి విషయం తెలిపారు

 4. Akshi ntala. Sakuntala

  Good morning
  Very good post ing

 5. Raja Ramesh Reddy.Bandi

  Good job. Keep going like thus

 6. చాల మంచి విషయాలు చెపుతున్నారు

 7. Chala sandehalu terayi
  Goppa vishayalu andistunnaru
  Krutagnatalu

 8. Nice information

 9. Very good bro

 10. కొణిజేటి శివ రామ ప్రసాద్

  చాలా బాగా చెప్పారు. మీ వివరణ బాగుంది

 11. Very good information we are getting everyday

 12. Excellent information Ashok Sir very informative

 13. Nice matter

 14. Very good site ashok

 15. Praveen Kumar reddy

  Anna super information. Ippati varaku bayapaduthunnanu.
  Tension ledu ippudu. Sarvey jana sukinobhavanthu.

  JAI SRI RAM🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *