ధన లక్ష్మికి ఉన్నంత గౌరవం సరస్వతికి ఎందుకు ఇవ్వరో తెలుసా

మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలున్నా అవి ధరించినపుడు మాత్రమే అందాన్ని యిస్తాయి. విద్యా అనే ఆభరణం మనిషికి సదా ఆభరణంగా వుండి కీర్తిని గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ధనవంతుడు తన వూరికే గొప్పవాడు. విద్యావంతుడు దేశానికే గొప్పవాడు. ధనంతో ఫలం కొనగలం! ఫలితాన్ని కొనలేము.

లక్ష్మీదేవి సరస్వతికి అత్తగారు అవుతుంది గదా! అత్తగారి అధికారం ఎంతటిదైనా కోడలి అధికారం తక్కువదేమీ కాదు. ధనం ఏ కారణంగానైనా తరిగిపోవచ్చు. విజ్ఞానం నానాటికీ పెరగటమే గాని తరిగిపోవటం ఉండదు. ధనాన్ని దాయాదులు భాగం తీసుకోవచ్చు. విద్యను ఎవరూ భాగం పంచుకోలేరు. ఎవరూ దొంగిలించలేరు. ఏనుగు ఎంత పెద్దది అయినా తొండం చిన్నదైనా దేని విలువ దానిదే మరి.

ఈ ధనకాముకజగత్తులో ధనవంతుడే భగవంతుడు. కాని వివేక ప్రపంచంలో విద్యావంతుడే సృష్టికర్త. విజ్ఞాన జగత్తులో ప్రజ్ఞావంతుడే పరమాత్మ. మదంతో మేధస్సు రాదు. ధనంతో విజ్ఞానం రాదు. ఈనాడు మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ మేధావంతులు విజ్ఞానులు ప్రసాదించి నవే గాని ధనవంతులు ఇచ్చినవి కాదు. ఈ మాత్రం జ్ఞానం కలిగినవాడు ఎవడైనా విద్యావంతునికి నమస్కరించి గౌరవిస్తాడు. జ్ఞానశక్తికి మించిన మరొక శక్తి ఈ జగత్తులో లేదు.

ఏడంతస్తుల మేడకట్టినా తానుండబోయేదీ, తనకు కావల్సిందీ ఆరడుగుల స్థలం మాత్రమే కదా అన్న జ్ఞానం కలిగిననాడు తపనపడిపోతాడు. తల్ల క్రిందులైపోతాడు. తనకుతానే గులకరాయిలా కన్పిస్తాడు. ధనం క్షణం కన్పించే మెరుపుతీగ. విద్య తనవారందరికీ వెలుగు చూపించి నడిపించే దారిదీపం. మెరుపుకున్నంత కాంతి దీపానికి వుండదు. దీపానికి వున్న ప్రయోజనం మెరుపుకి వుండదు. డబ్బుతో మందులు కొనవచ్చు. వైద్యుని కొనలేవు. ఒకానొక సమయంలో వైద్యుని కూడా కొనవచ్చు. వైద్య విజ్ఞానాన్ని కొనలేవు.

విజ్ఞానమే సరస్వతీమాత! ఎవరైనా పిల్లను కొనగలరు. తల్లినిమాత్రం కొనలేరుగదా.అలాంటి సరస్వతి మాత బిడ్డలు కనపడితే (అంటే విజ్ఞానవంతులు) తలవంచి నమస్కరిద్దాం. మనం ఏ స్థాయిలో ఉన్న, ఎక్కడ ఉన్నా మన గురువులు కనపడితే ,వారికి శిరస్సు వంచి నమస్కరిద్దాం. వారి బాగోగులు కనుక్కుని ,మనకు వీలైన సాయం చేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్ నిజమా ? కాదా ?

About Ashok Kanumalla

Ahsok

Check Also

బ్రాహ్మణులకు మాత్రమే దాన ధర్మాలు ఎందుకు చెయ్యాలి ?బ్రాహ్మణులు నిజంగా వాటికి అర్హులేనా ?

బ్రహ్మ జ్ఞానాత్తు బ్రాహ్మణః’ అంటున్నది శాస్త్రం. మనం చూస్తున్న బ్రాహ్మణ కులం వారి నందరినీ బ్రాహ్మణులు అనుకొంటున్నాం. వీరందరూ జన్మ …

6 comments

  1. Awesome…!

  2. మోహన్ కిషోర్ నిమ్మ

    అన్న మీరు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు

  3. Marvellous information

  4. Excellent 👌👌👍👍 marvelous information 👌👌👌👌

  5. మల్లికార్జున రావు ఊరందూరు

    Excellent

  6. Excellent msg for all generations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *