నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 3

 • ప్రతి రోజు మనం చెయ్య వలసినవి, చెయ్యకూడనివి

1. ఆలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం , స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

2. పురుషులు దేవునికి సాష్టా0గ నమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

3. యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు, హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.

4. దేవాలయంలో తీర్ధము తీసుకొనునపుడు మూడుసార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా తీసు కొనవలెను. వెంటవెంటనే 3 సార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.

5. ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి,దానితో 2 ఒత్తులను(దీపారాధన)వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.

6. ఈస్వ రునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణు మూర్తికి అలంకారం, గనేషునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం .అవి చేస్తే మంచి జరుగుతుంది.

7. భగవంతుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.

8. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

9. ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.

10. దేవుని దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

14 comments

 1. Raja Ramesh Reddy.Bandi

  Very good news

 2. K. Sreenivasulu

  Tq Ashok gaaru🙏🙏🙏🙏👌

 3. నిమ్మా మోహన్ కిషోర్

  అన్న చాలా బాగున్నాయి మీది పోస్టులు

 4. ఆలేటి హరి

  Good information ashok

 5. Thankyou sir

  • అక్షింతల పార్థసారథి

   Chala baga చెప్పారు అశోక్ కుమార్

 6. Supper

 7. Nilabadi unna krishnudi bommale aekkuvaga untay kadaa
  Deeparadhana gurinchi goppaga chepparu
  Ganeshnuni ki tarpanam ante istam annaru adi elaga

 8. Jagadeesh Kumar

  Precious Information, Thanks

 9. Very good information sir

 10. Dhulipalla Raghavendra Rao

  Good information for devalaya sandarshana paddhathulu

 11. Akshi ntala. Sakuntala

  Good information

  Good night sweet dreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *