నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 4

ప్రతి రోజు మనం చెయ్యవలసినవి, చెయ్యకూడనివి

1. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

2. నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి అయినను దేవునికి ప్రీతికరము.

3. జపములు మూడు రకములు.అవి:
1.  వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది.
2. ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది.
3.  మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.

4. ఆడవారు  ఓంకారాన్ని జపించకూడదు.

5. ఉదయం , సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.

6. తులసి దళములను పూజ చేయునపుడు దళములుగానే వెయ్య వలెను. ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్య కు భర్త వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి, ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

7. తాకుట వల్ల దోషము లేనివి: తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు, మార్గమునందు, వివాహమునందు, సభలందు ,కార్లు, రైళ్ళు, విమానాలు మొదలగు వాహనాలలో ప్రయాణమందు స్పర్శ దోషం లేదు.

8. ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు, బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.

9. వినాయకుని ఒకటి, ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు, విష్ణు మూర్తికి నాలుగు, మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి.

10. పురుషులు నిలబడి మూత్రము పోయరాదు , అట్లు పోసిన దరిద్రము, నపుమ్సకత్వము కలుగును.స్త్రీలు నిలబడి మూత్రము పోసిన నరముల బలహీనత, దరిద్రము, భర్తవియోగము కలుగును.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

17 comments

 1. Thanks for the information Ashok sir

 2. Thank you for the information sir

 3. Very good information dear Ashok

 4. Harek krishna 🙏

 5. Valuable information

 6. Guru nath reddy

  Good information

 7. Good information

 8. Nice info Anna, more info send me Anna
  Thank u Anna.

 9. Prabhakar mamuduru

  Super article sir

 10. అక్షింతల పార్థసారథి

  థాంక్యూ బామ్మర్ది చాలా మంచి విషయాలు అన్ని మనసుని అదుపులో పెట్టుకోమని చెప్పేవే
  ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్

 11. Akshi ntala. Sakuntala

  You very sooooo intizent
  Very good post thanks

 12. Konijeti isivaramprasad

  చక్కగా వివరించారు

 13. మాకు తెలియాని ఎన్నో అద్భుతమైన ఆసక్తికరమైన తెలియజెస్తున్నారు,🙌

 14. Dhulipalla Raghavendra Rao

  Good information

 15. Chala chala teliyani vishayalu telusukuntunnam

  Navagrahalaku tiragatam chala vivaramga chepparu
  Sivalayam lo mundu
  Vishnu aalayam lo tarvata
  Vivarana adhbutam

  Anni chala baga cheptunnaru

 16. P. Sriharireddy

  Thank you Good information Ashoka garu

 17. P. Sriharireddy

  Good information . Raavi chettu ki anni rounds cheppagalaru please Ashok garu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *