నిత్య కృత్యాలు – ఆచరించదగినవి- 2

ప్రతి రోజు మనం చెయ్య వలసినవి, చెయ్య కూడనివి

1. గ్రహణం పట్టుచుండగా స్నానం, పూర్తిగా పట్టినపుడు జపము, విడచిన పిమ్మట స్నానం చెయ్యాలి. గ్రహణం తర్వాత 7 రోజులు ఎటువంటి శుభకార్యములు చేయరాదు.

2. ప్రయాణమునందు అపశకునము కలిగిన కాళ్ళు కడుగుకొని, కొద్ది సేపు కూర్చొని,  బెల్లమును తిని బయలుదేరాలి.

3. శన్యూషః కాలం: అనగా శనివారం రోజు సూర్యోదయమునకు ముందు రెండు ఘడియల (48 నిముషాలు)నుంచి సూర్యోదయం వరకు వుండే కాలాన్ని శన్యూషః కాలం అంటారు. ఆ సమయంలో ఏ మంచి పని మీద అయినను ప్రయాణం మొదలు పెడితే , ఆ పని తప్పక నెరవేరుతుంది. అంటే ఆ కాలంలో ప్రయాణం చెయ్యాలి.

4. ఉపవాసము చేయునపుడు తినతగినవి: నిషిద్ధములు కాని దుంపలు, పచ్చి కాయలు, కొబ్బరి, కొబ్బరినీళ్ళు, పిండితో చేసిన రొట్టెలు,నీళ్ళు, ఉప్పుడుపిండి, గుగ్గిళ్ళు, పంచదార, బెల్లంతో కలిపినవి, పేలాలు, అటుకులు. ఇవి పండ్లుతో సమానము తినవచ్చును.

5. కార్తీక మాస భోజన విశిష్టత:  కార్తీక మాసమందు ఏ దినమునందైన బ్రహ్మనులతోను, బంధువులతోను కలసి రావి, వేప, పెద్ద ఉసిరి, మామిడి, మారేడు, వెలగ, మర్రి, చింత వీటితో కూడి ఉండి బావి యున్న వనమున భోజనము చేసిన వారు వరుసగా 100 జన్మలందు జగదీస్వరుడై జన్మించును. దీనికి దృష్టి దోషం లేదు.

6. అరటి, మర్రి ఆకులతో చేసిన విస్తర్లలో భోజనం చేసిన అనారోగ్యం రాదు.. మట్టి పాత్ర (లేదా) రాగి పాత్రలో నీరు త్రాగితే చాలా మంచిది.

7. అన్నదానం చేయాలనుకుంటే ఎంగిలిది, వదిలేసినది, పాడైనది పెట్టవద్దు. అన్నదానమిచ్చిన తర్వాత మనం తినవలెను.

8. అక్షయ తృతీయ, విజయదశమి, కార్తీక మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున సాయంత్రం వరకు సాడేతీన్ ముహూర్తములు అంటారు. ఈ రోజులలో పంచాంగం చూడకుండానే ప్రతి శుభకార్యం ప్రారంభించవచ్చు.

9. రాహు కాలంలో శుభకార్యములు, గుళికకాలంలో అశుభకార్యములు మొదలు పెట్టరాదు.

10. తిధులు: రెండు పక్షముల0దున చవితి, షష్టి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్ధశి తిధులలో మంచి పనులు మొదలుపెట్టకూడదు. అమావాస్య రోజు పితృ కర్మలు చేయవచ్చును.శుభ కార్యములు చేయరాదు.

11. భోజనము(ఆహారం తినిన వెంటనే) చేసిన వెంటనే స్నానము చేయరాదు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

12 comments

 1. విలువైన మాటలు చెప్పారు అన్న గారు

 2. Raja Ramesh Reddy.Bandi

  Very good news

  • అక్షింతల పార్థసారథి

   చక్కటి విషయాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు శుభరాత్రి

 3. K. Sreenivasulu

  చాలా ఉపయోగకరమైన విషయాలు …🙏🙏🙏🙏🙏

 4. సూపర్ గా చెప్పారు

 5. మోహన్ కిషోర్ నిమ్మా

  మంచి విలువైన సమాచారాన్ని ఇస్తున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న

 6. ఆలేటి హరి

  మంచి విషయాలు. బాగున్నాయి. థాంక్స్

 7. Supperrr vaulble information sir

 8. Padarthi Balaji

  Superrrr Anna garu

 9. Super annaiah

 10. P. Sriharireddy

  Good Information thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *