నియోగం పద్దతి ద్వారా భార్య మరొకరితో సంతానం పొందవచ్చా ?

కఠినమైన ప్రశ్న యిది. కానీ శాస్త్ర సమ్మతంగా సమాధానం చెబుతాను.మను స్మృతిలో చెప్పిందే చెబుతున్నాను.

శ్లో| యస్తల్పజ: ప్రమీతస్య క్లీబస్య వ్యాధి తస్య వా స్వధర్మేణ నియుక్తాయాం సపుత్ర: క్షేత్రజః స్మృతః ॥
మనుస్మృతి 9-167

భర్త నపుంసకుడు, దీర్ఘరోగి అయినా, సంతానాభివృద్ధికి పనికి రాక పోయినా, భర్త సమ్మతితోగాని, పెద్దవారి సమ్మతితోగాని స్త్రీలు సంతానవంతులు కావచ్చు. అయితే సగోత్రీకులతోనూ, సదాచారవంతులైన వారితో మాత్రమే ఋతుసమయంలో పుత్రాపేక్షతో సంబంధం కలిగి వుండాలి. సంతానానంతరం ఈ సంబంధం పాపకరం. ఈ ధర్మపద్దతిని ‘నియోగం’ అంటారు. ఈ విధంగా పుట్టిన బిడ్డ ‘క్షేత్రజుడు’ అవుతాడు. గోత్ర స్వీకారానికీ పిండ ప్రదానానికి ఈ పుత్రుడు అర్హుడే! మహాభారతంలో ధృతరాష్ట్రుడు పాండురాజు ఈ ధర్మ పద్ధతితోనే వ్యాసమహర్షికి జన్మించినా క్షేత్రజధర్మంతో క్షత్రియులయ్యారు. పాండవులు కూడా ఈ నియోగ పద్ధతివల్లనే కుంతి మాద్రి కి పుట్టి క్షత్రియులయ్యారు పాండు పాత్రులయ్యారు

శ్లో॥ దేవరాద్వా సపిండాద్వా, స్త్రియా సమ్యక్ నియుక్త యా ౹
ప్రజేప్పితాధి గంతవ్యా సంతానస్య పరిక్షయే౹౹ 9-59

ఒక తండ్రి బిడ్డలైన అన్నదమ్ములలో ఒకరు అకారణంగా సంతానహీనుడైతే సోదరుల వల్ల తన భార్యతో సంతానాన్ని పొందవచ్చు. ఇది తప్పుగాదు. ఒక సంతానానికి మాత్రమే పరిమితం. తరువాత మహా నిషిద్ధం. దీన్ని క్షేత్రప్రాధాన్య ధర్మం అంటారు. ఈ ధర్మాన్ని అన్ని స్మృతులు అంగీకరించాయి.

ఆనాడు వంశాభివృద్ధికి పెద్ద పీట వేయటం జరిగింది. వంశంకోసం వారు సంతతి కోసం ఎంతగా పరితిపించే వారో ఈ “నియోగ ధర్మం” తెలుపుతోంది. ఆ కాలంలో సంతానమే సంపదగా భావించేవారు. సంతాన బలమే సామాజిక బలంగా విశ్వసించి అభివృద్ధి పరచే వారు.అపుడు అతి సంతానం గొప్పదైతే ఇపుడు మిత సంతానం గొప్పది అంటున్నారు నూరు సంవత్సరా లకే యింతటి మార్పు వచ్చింది

స్త్రీ పురుష సంయోగం సంతానం కోసమే, సుఖాలకోసం కాదు. గర్భద్వారం సరిలేనివారు, భర్తకు వీర్యాణువుల లోపం ఉన్న వారు, ఎవరిది పురుష వీర్యాన్ని గర్భంలోనికి ఎక్కించుకొని పిల్లల్ని కనటం సంతాన కేంద్రాల్లో చూస్తున్నాం. ఎవరిదో వీర్యం వల్ల పిల్లల్ని కనటం కన్నా సగోత్రీకుల వీర్యదానంతో సంతానాన్ని పొందటం ఉత్తమం కదా.

ఏ శాస్త్రమైనా, ఏ ధర్మమైనా, ఏ ఆచారమైనా, మానవ హితం కోసం సత్ప్రవర్తన కోసం మానవ  అభివృద్ధి కోసం రచింపబడ్డాయి.  అయితే దురాచారపరులైన ఈనాటివారు శాస్త్రాలను తమ  కనుకూలంగా దిద్దుకొని విపరీత వ్యాఖ్యానాలు సృష్టించటంవల్లనే చాలా సమస్యలు పుట్టాయి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

5 comments

  1. Super

  2. మల్లికార్జున రావు ఊరందూరు

    Ok

  3. Chala goppaga chepparu
    Ivbandini sastra badhamga ela xheyalo chepparu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *