భర్త చనిపోతే పూలు కుంకుమలను భార్య పెట్టుకోవటం మానెయ్యాలా….

ఇది భార్యాభర్తల అనుబంధానికీ, అనురాగానికీ, ఆత్మానుబంధానికి సంబంధించిన విషయం. వివాహబంధాన్ని గౌరవించే విషయం

మరణించిన భార్య కోసం ‘తాజమహల్’ కట్టించిన భూమి యిది. భార్య భాగమతికోసం భాగ్యనగరం (హైదరాబాద్) వెలసిన చోటు ఇది పరిత్యజించిన సీతకోసం పరితపించాడేగాని పునర్వివాహానికి అంగీ కరించని శ్రీరాముని కన్న భూమి యిది. తాళి కట్టిన భార్య కోసం సర్వం త్యాగం చేసి సన్యాసం స్వీకరించినవారు, ఆత్మాహుతి చేసుకొన్నవాళ్ళు, ఎందరో చరిత్రకందని వాళ్ళు వున్నారని చెప్పటం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు ఈ విషయం ఈ ప్రశ్నకు సంబంధించినది కాకపోయినా ఈ భూమి, నీరు గాలి గూర్చి చెప్పక తప్పలేదు

 

భర్త మరణించిన తరువాత స్త్రీలు పూలను కుంకుమను వదలివేయటంలో ఆత్మార్పణ భావం వుంది. దాదాపు నలభై సంవత్సరాలు తనతో మమేకంగా జీవించి, కష్టసుఖాలు భాగం పంచుకొని తమకోసం పగలు రాత్రి శ్రమించిన భర్త మరణించిన తరువాత సౌందర్యసూచకమైన కంకుమను, సౌఖ్యసూచకమైన పూలను, రంగురంగుల వస్త్రాలను త్యజించి దేహదండన నిమిత్తంగా ఒక పూట భోజనం చేసేవారు. ఇది ఆనాటి స్త్రీల సంప్రదాయం . అయితే సదాచారంగా ప్రారంభమైన ఈ పద్దతి దురాచారంగా మార్పు చెందింది. వయోబేధంతో ముడిపడివున్న ఈ పద్ధతిని ఛాందసవాదులు అందరూ కల్సి లోకమే తెలియని బాలికలను సైతం ఆచారం పేరుతో బలత్కారంగా కట్టుబొట్టు మార్పించేవారు. గుండు గీయించి మూల కూర్చోబెట్టేవాడు. వంటగది మాత్రమే పరిమితం చేసేవారు. ఇది చాలా అనాగరిక దురాచారం కదా1929లో శారదా చట్టం వచ్చింది. ఇది ఆడపడుచులందరికీ మహావరంగా చెప్పవచ్చు. తరువాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి 1856 వ సంవత్సరంలో వితంతు వివాహం చట్టం అమలులోకి వచ్చింది. ఆంధ్రాలో కందుకూరి వీరేశ లింగంపంతులు వితంతు వివాహాలను జరిపించి స్త్రీ జాతికి చెప్పరాని ఉపకారం చేశారు

ఎపుడైతే వితంతు వివాహాలు ప్రారంభమయ్యే యో, అప్పటినుండి పోయిన కుంకుమ సౌభాగ్యం స్త్రీలకు మరలా వచ్చింది. ఈ కట్టు బొట్టుల పట్టు మెల్లగా సడలిపోయింది. వితంతువులు సైతం ఇపుడు కుంకుమను ధరిస్తున్నారు వివాహిత స్త్రీలకు వితంతువులకు వ్యత్యాసం లేదిప్పుడు దీనిని మనమందరం హర్షిద్దాం స్త్రీల నందరిని అభిమానించి గౌరవిద్దాం ఆచారాలు వుండాలి. కాని దురాచారాలు వుండకూడదు దారి చూపలేని ధర్మం వల్ల ప్రయోజనం లేదు

“కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింటనుండ నొల్లదు సుమతీ” స్త్రీల కంటిలో కన్నీరు మన భవితకు మంచిది కాదు కదా అందుకని స్త్రీలను గౌరవిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్…..

మీ
అశోక్ కనుమళ్ల
సర్వేజనా సుఖినో భవంతు

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

7 comments

 1. Raja Ramesh Reddy.Bandi

  The Indian traditional information

 2. అక్షింతల పార్థసారథి

  Nice message

  Good post

  Good night

  Ashok Kumar

 3. Yentha goppa vishayam chepparo meeru thankq sir

 4. Superabba 👍

 5. I support

  Grate aenno vishayalanu cheptunnaru

 6. మల్లికార్జున రావు ఊరందూరు

  Yes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *