Breaking News

భర్త చేసే అన్ని కార్యాలలో భార్య ఎడమప్రక్కనే ఎందుకు ఉండాలి ?

పురుషుడు చేసే అన్ని కార్యాలలోనూ భార్య ఎడమప్రక్కన వుండాలని లేదు. కొన్ని ధార్మిక కార్యాలకు మాత్రమే ఈ పద్ధతి వుంది.

అభిషేకే రథారోహే, దంపతే శయనే తథా౹
శ్రద్దే స్నాన తథా దానే, పత్నీ తిష్ఠతి వామనః౹౹

అభిషేక కార్యక్రమాలలో, ప్రయాణాలలో, ఒకే మంచంమీద నిద్రించేటపుడు, పుణ్యస్నాన సమయాలలోనూ, దానధర్మాలు చేసే సమయం లోనూ భార్య భర్తకు ఎడమవైపున వుండాలి. వివాహ సమయంలో కన్యాదానం చేసేటపుడు, విగ్రహప్రతిష్ఠ, యజ్ఞయాగాల సమయాలలో భార్య భర్త కి కుడి వైపున వుండాలి అనేది శాస్త్ర నియమం.

 

సృష్టికర్త తాను సృష్టి ప్రారంభం చేసేటపుడు తన కుడి భాగం నుండి పురుషుణ్ణి ఎడమ భాగం నుంచి స్త్రీని సృష్టించాడట. బైబిల్ లో కూడా స్త్రీని ఎడమవైపు గుండె ఎముక నుండి, పురుషుని కుడివైపు గుండె ఎముక నుండి దేవుడు సృష్టించాడని వ్రాయబడి వుంది. అన్ని మతాలు కూడా సృష్టి విషయంలో ఒకే అభిప్రాయం కల్గి వుండటం విశేషం. పురుషునికి ఎడమవైపుగా స్త్రీ వుండాలని చెప్పటంలో ఒక సున్నితమైన రహస్యం దాగిఉంది. పురుషునికి గుండె వుండేది ఎడమవైపుననే గదా! అర్దాంగియైన స్త్రీని తన హృదయభాగాన నిలుపుకోవాలని శాస్త్రం చెబుతోందన్నమాట’

శ్రీమహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని తన ఎడమభాగాన దాచుకొన్నాడట. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఒకే రూపంగా ఒకరిలో ఒకరు లీనమై వుంటారు గదా! పరమేశ్వరుని ఎడమ భాగం పార్వతీదేవి లీనమై ఉంటుంది. మనిషి స్పందనకూ సాన్నిహిత్యానికి జీవనవికాసానికీ ఎడమ భాగం పనిచేస్తుంది కాబట్టి స్త్రీని ఎడమవైపుగా వుంచుకోవటం ఎంతో సముచితం.

మానవుని కుడి ఎడమ భాగాలకు వ్యత్యాసం వుంది. కుడి భాగంలోని అవయనా లన్నీ దృఢంగా బలంగా కష్టించటానికి అనుకూలంగా వుంటాయి. ఎడమ భాగంలోని అవయవాలు అన్నీ కూడా సుకుమారంగానూ సహాయస్థితి గలవిగానూ వుంటాయి. మనం తినే ఆహారం ఎక్కువగా నమిలి కష్టపడేది కుడివైపు దవడ దంతాలు మాత్రమే! ఇది మనకు తెలియకుండానే జరుగుతుంది.

స్త్రీ పురుషులిద్దరూ ఒకే మంచంమీద నిద్రించేటపుడు పురుషుడు తనకుడి చేతిని స్త్రీ మీద వేసి నిద్రలో కూడా స్త్రీని రక్షించుకొంటూ నిద్రపోతారు. ఇవన్నీ మనకు తెలియకుండానే అప్రయత్నంగా జరుగుతుంటాయి. అందుకే ఆమె అర్ధాంగి. అందుకే “పురుషుని ఎడమ భాగం స్త్రీ’ అంటున్నది శాస్త్రం కాబట్టి స్త్రీని మనం పవిత్రంగా ,మన గుండెకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంత ప్రాధాన్యత ఇచ్చి రక్షించుకోవాక్సిన బాధ్యత మనది ఏమంటారు. నిజేమే కదా.

 

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

7 comments

  1. Nice information 👌👌👌

  2. చాల బాగా చెప్పారు సంతోషం

  3. మల్లికార్జున రావు ఊరందూరు

    Gd info

  4. Good information

  5. Excellent

  6. Challa baga teleya chasaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *