మన భారత దేశంలో ఆహారాన్ని విద్యను విక్రయించకూడదా….

భారతదేశం పుణ్యభూమి ఇక్కడ అన్న విక్రయం జరగకూడదు, ఇది వేదభూమి ఇక్కడ వేదశాస్త్రాల విక్రయం వుండకూడదు, ఇది ధర్మభూమి ఇక్కడ విద్యావిక్రయం చేయకూడదు, ఇది కర్మభూమి ! ఎవరూ దుఃఖితులు కాకూడదు అన్నది మన సంస్కృతి.వేల సంవత్సరాల నాటి భారతదేశ సమాజం, భారత ప్రజలు, భారతదేశం రాజరికం పైన చెప్పిన సిద్ధాంతాలను తు.చ తప్పకుండా నియమనిష్ఠానిరతులై పాటించేవారని శాస్త్రాలు స్మృతులు చెబుతున్నాయి.

1000 సంవత్సరాల క్రితం వరకూ ఆహారాన్ని విద్యనూ విక్రయించేవారు కాదిక్కడ. అంతెందుకు ఈనాడు కూడా వేదపురోహితులు వివాహం చేయించినా, పూజాదికాలు చేయించినా ముందుగానే యింత ఇవ్వాలని బేరం చేయరు. ఎక్కడైనా ఎవరైనా పెండ్లి చేయిస్తే ఎంతిస్తారు? పూజ చేయించితే ఎంతిస్తారు? అని గనుక అడిగితే వాడు బ్రాహ్మణుడే కాదని శాస్త్ర అర్ధం. అటువంటి బ్రాహ్మణునితో వివాహాది వైదిక కార్యక్రమాలు చేయిస్తే ఫలితం వుండకపోగా దురితం వస్తుంది

భోజన హోటల్స్, ఉపాహారశాలలు మన సంప్రదాయం కాదు. అందువల్లనే భారతీయ ధర్మశాస్త్రం అతిథి దేవోభవ’ అని చెబుతుంది. ప్రతి గృహస్థుడూ వర్ణకుల విబేధం లేకుండా ప్రతిరోజూ ఎవరో ఒక అతిథికి భోజనం పెట్టి దైవకార్యంగా సంతోష పడేవాడు. ‘అన్నదాతా సుఖీభవ’ అని భోజనం చేసిన అతిథి ఆశీర్వదించి వెళ్ళేవాడు. ప్రతి ప్రాణికీ ఆహారం అతిముఖ్య అవసరం.

ఇంకా ‘విద్యా దానం చేయడం మహత్తరం మనం నేర్చిన విద్య మనతోనే నశించి పోకూడదు. ఒక విత్తనం నాటితే వేల విత్తనాలు మనకు అందించినట్లు మనం నేర్చిన విద్య మన సమాజానికి అందించి విద్యా సంపన్నులు చేయటమే విద్య పరమార్ధం! . మనిషికి విజ్ఞాన వివేకాల నందించే విద్యను ధనాశతో విక్రయంసాగిస్తే నీవు జన్మించిన నీ సమాజానికి నీవేమి వుపకారం చేసినట్లు? నీ జన్మభూమికి నీ రుణం తీరేదెట్లు?జననీ జన్మభూమిశ్చ స్వర్గా దపి గరీయసి‘ అన్న హితవాక్యం ధూళికి పోయినట్లే గదా. ప్రపంచానికే ఆదర్శ వంతమైన దేశం మనది ఒకప్పుడు.

పాశ్చాత్యుల పాదార్పణతో భారత సంప్రదాయాలన్నీ హారతి కర్పూరం అయిపోయాయి. ఈనాటి విద్యార్థులు చదవడం లేదు. “చదువుకొంటున్నారు”. ఈ దేశ తీరుతెన్నులన్నీ మారిపోయాయి. మార్పు సహజమే. మార్పు కోరుకోవటమే మానవలక్షణం. మార్పు లేకుంటే మనమింత ప్రగతిని సాధించిన వాళ్ళం కాదు కాని మార్పుతో పాటుగా మానవత కూడా వుంటే ఎంత బాగుంటుంది మానవత నిండిన మనుగడ మాత్రమే మనిషికి మహదానందాన్ని కల్గిస్తుందన్నది నిత్య సత్యం

ఎన్నిదేశాలనైనా పర్యటించు, మన దేశాన్ని మాత్రం మరిచిపోకు. ఎన్ని భాషలనైనా నేర్చుకో,తల్లి భాషను మరచిపోకు అన్నది మన సంస్కృతి సంప్రదాయం.కానీ ఇపుడు ఆంగ్లంలోనే మాట్లాడితే గొప్ప వ్యక్తిగా చూడటం అలవాటు అయింది. మన తెలుగు ని దాదాపు రాయడం ఇపుడు పిల్లలు మర్చిపోయారు.తల్లితండ్రులు కూడా ఆంగ్లానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు.కాబట్టి మన తెలుగు భాషను వాడుతూ,రాస్తూ దాన్ని కాపాడుకుందాం.ఏమంటారు ఫ్రెండ్స్ నిజమేగా…..

మీ
అశోక్ కనుమళ్ల
సర్వేజనా సుఖినో భవంతు

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

6 comments

 1. Excellent 👌👌👍 words great information

 2. Raja Ramesh Reddy.Bandi

  Exactly
  Our Indian tradition and culture are always the best
  Well said
  Thank you
  🙏🙏🙏🙏🙏

 3. Excellent information

 4. అక్షింతల పార్థసారథి

  చాలా బాగుంది
  చాలా బాగా రాశారు

 5. మల్లికార్జున రావు ఊరందూరు

  Yes

 6. Akshi ntala. Sakuntala

  Use full information

  Thanks for post B r

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *