మీకు రావలసిన డబ్బు -అప్పుగా ఇచ్చిన డబ్బు రావట్లేదా…అయితే ఇలా చేయండి

మనకు రావలసిన డబ్బు మనకు అందకుండా పోవడం, అప్పులు ఇస్తే అవి ఎగొట్టబడుతూండడం,మన డబ్బు ఇతరుల దగ్గర ఇరుక్కుపోయి ఉండటం వంటివి ఆర్థిక పరమైన అడ్డంకులు అవుతాయి.ఇలాంటి డబ్బు తిరిగి రావాలి అంటే ఈ రెమెడీస్ చెయ్యండి మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది.

 

1. ఊడ్చే పనివాళ్ళకు పొగాకు సంబంధమైనవి (సిగరెట్, చుట్ట వంటివి) దానం చేయండి.

2. తేయాకు సంబంధమైన (టీ) పనివాళ్ళకు ఇప్పిస్తూ ఉండండి.

3. పసుపు, సిందూరం, గంధం కలిపి ఆ తిలకాన్ని నుదుట ధరిస్తుండండి.

4.తోలు పర్సులు,బాగ్స్ లలో డబ్బు పెట్టి తిరగవద్దు.

5.సూర్యాస్తమయం తర్వాత పాలు తాగవద్దు.

6.మీ ఇంటి ఆవరణలో మల్లె చెట్టు లేక జాజి చెట్టు పెంచండి.

7.మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద రాసి నీటిలో వేయటం గాని, వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే కచ్చితంగా డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది.

ఈ రెమెడీస్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు – సూచనలు చూడండి. పైన సూచించిన రెమెడీలు చాలామందికి సిల్లీగా కనిపించవచ్చు! అపనమ్మకం పనికి రాదు. కార్య-కారణ సంబంధం లేకుండా ఏదీ చెప్పబడలేదు

1.రెమెడీలు శక్తివంతంగా ఫలితదాయకంగా ఉండాలంటే మాంసాహారం, అక్రమ సంబంధాలు పనికిరావు.
2. రెమెడీలు పాటిస్తున్నప్పుడు ఒట్లు వేయద్దు

3. ఏ రెమెడీ అయినా ఒకేరోజు ఒక్కటే పాటించాలి. చెప్పబడినవి అన్నీ చేసేసి ఇంకా ఫలితం కనపడదేం అని విసుక్కోరాదు. మీ తదుపరి జన్మ తేదీవరకు చూడాలి.

4.అన్ని రెమెడీలు, అందరి జాతకాలను దృష్టిలో ఉంచుకొని న్యాయంగా కూర్చబడ్డాయి. పనిచేయడం విషయంలో మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది, మేము బాధ్యులు కాము.

5.జాతకంలో సాధారణంగా దుష్ఫలితాలు కలిగించే గ్రహాలను బట్టి ఆయా రెమెడీలు చెప్పాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ శాంతులు(రెమెడీస్) పాటించి మీ ఆర్థిక పరమైన ఇబ్బందులకు దూరమవుతారు అని ఆశిస్తున్నా…

About Ashok Kanumalla

Ahsok

Check Also

వివాహం అలస్య మవుతోందా ? మీరు అనుకున్న వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇలా చెయ్యండి

1. పార్వతి దేవిని ఆరాధించాలి. 2. ఎర్రని మరియు నల్లని దుస్తులు ధరించవద్దు. 3. మీ ఆలోచనలను ఇతరులకు వెల్లడించవద్దు. …

9 comments

 1. Good information

 2. 🤣🤣🤣🤣🤣🤣

 3. Nice information .excellent 👌👌👌👍

 4. హరి ఆలేటి

  Try chestanu

 5. Nice…

 6. Good information
  Thanq

 7. మంచి విషయాలు తెలిపి నందు కు ధన్యవాదాలు

 8. Raja Ramesh Reddy.Bandi

  New and apt information for the current situation..
  Hope it will be useful.
  Thank you very much
  🙏👍🙏👍🙏👍🙏👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *