మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా ? చేసుకుంటే ఫలితం ఏమిటి?

అక్క కూతురిని, మేనత్త కొడుకు, మేనమామకూతుర్ని పెండ్లి చేసుకొనే పద్ధతి ఆంధ్ర – కర్ణాటక – తమిళనాడుల్లో మాత్రమే వుంది. ఉత్తర భారత దేశంలో ఈ సంప్రదాయం లేదు. అంటే ఈ సంప్రదాయం ద్రావిడ సంప్రదాయమేగాని ఆర్య సంప్రదాయం కాదని తెలియవస్తోంది.

అర్జునుడికి సుభద్ర మేనమామ కూతురు! శ్రీకృష్ణుని అష్ట భార్యాలలో ఒకరైన ‘భద్రాదేవి’ కృష్ణుని మేనత్త, శ్రుతకీర్తి కుమార్తె. ఈ విధంగా చూస్తే ఆర్యులలో ఈ సంప్రదాయం వున్నట్లే గదా! కానీ మహాభారత యుద్దా నంతరం ఈ వరుసలు ఆర్యుల్లో మాసిపోయాయట! కృష్ణునివల్ల భద్రాదేవికి పుట్టిన పదిమంది సంతానం మూర్ఖులైపోయారనీ, సుభద్ర మేనత్త కొడుకుని చేసుకోవటం వల్లనే అభిమన్యుడు అర్థాయుష్షుతో మరణించాడని ఇప్పటికీ ఉత్తర భారతం వారు నమ్ముతారు.

తల్లి తరపున ఏడు తరాలు, తండ్రి తరపున ఏడుతరాలు వదలివేసి వివాహ సంబంధం కుదర్చాలని ‘ధర్మసింధు చెబుతున్నది. మనువు కూడ ఈ విషయాన్ని బలపరిచాడు. కాని, మన బిడ్డ మనకళ్ళ ఎదురుగా వుండాలనీ ఆస్థిపాస్తులు పరాయి వారికి చెందరాదని ఆలోచించి స్వార్థ బుద్ధితో అక్క బిడ్డను పెండ్లి చేసుకోవటం, మేనత్త కూతుర్ని చేసుకోవటం జరుగుతూ వుంది. ఇది తప్పు.

అపరిచిత స్త్రీ పురుషుల్లో అనురాగమేకాదు, అవగాహన కూడా ఉంటుంది అంటే, నూటికి నూరుశాతం ఈ విధంగానే వుంటారని కాదుగాని ఎక్కువశాతం దంపతులు సుఖంగా వుంటారని చెప్పవచ్చు! ఒక్క ఆరోగ్య విషయంలోనే కాదు, ఆర్థిక విషయాలలో గానీ, గౌరవ ఆదరాల విషయంలో గానీ, ఏ రకంగా ఆలోచించి చూచినా అక్కకూతురిని చేసుకోకపోవటం మంచిదిగా కన్పిస్తోంది. అలాగే మేనత్త కూతుర్ని, మేనత్త కొడుకునీ, తరువాత మేనమామ కూతుర్ని పెండ్లి చేసుకోక పోవటం కూడా మంచిది

చాలామంది పెద్దవారికి కూతురి బిడ్డ అయితే తమను అభిమానంగా చూస్తుందనీ, వృద్ధాప్యంలో ఆదరిస్తుందనీ, పిచ్చి ఆలోచనలు చేస్తారు. ఇదంతా తప్పు. కోడలుగా వచ్చిన కూతురి బిడ్డ ఏంచేసినా సర్దుకుపోతాం. పాపం తెలియదులే అని మన్నిస్తాం. అదే పరాయి బిడ్డ కోడలిగా వస్తే ప్రతాపం చూపిస్తాం. పరాయి కుటుంబం నుండి వచ్చిన కోడల్ని కూతురులా చూచుకో గల్గితే, మనల్ని ఏ కోడలైనా ప్రేమగానే చూస్తుంది. అభిమానిస్తుంది గౌరవిస్తుంది.అందుకని మీరు బాగా ఆలోచించి సరయిన నిర్ణయం తీసుకుంటారు అని ఆసిస్తూ….

దగ్గర సంబంధాలు చేసుకోవటం వల్ల భార్య భర్తల్లో అనురాగం ఉండదు. కామ ప్రేరేపనాశక్తి కూడా బలహీనంగా వుంతుంది. దగ్గర సంబందాలు ఆలు మగలకు పుట్టే బిడ్డలు మందమతులు గాను, అవయవలోపం గలవారు గాను, అవిద్యావంతులుగానూ వుంటారని పరి శోధకులు చెబుతున్నారు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

8 comments

 1. Good information

 2. Good information

 3. Yes absolutely correct sir good information 👌👌👌

 4. 💯% correct 👍👍👍🙏🙏🙏

 5. అక్షింతల పార్థసారథి

  Thanks for your

  Kind information

  Ashok Kumar

 6. చాలా చక్కగా వివరించారు అన్నగారు

 7. మల్లికార్జున రావు ఊరందూరు

  Important information

 8. Oooooo
  Spr
  Atta kodali bhandamm spr ga chepparu.
  Malo alochana sakthini penchutunnaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *