మేష రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి.

ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి..
మేషరాశి : పేరులో మొదటి అక్షరం – చూ, చే ,చో ,లా,లీ, లూ, లే,లో, ఆ
నక్షత్రం : అశ్విని 4 పాదములు వారు, భరణి 4 పాదములు వారు,కృత్తిక మొదటి పాదం

1. మేష రాశిలో జన్మిస్తే, అహంకారం పనికిరాదు. స్త్రీ సంతానానికి పెళ్ళి ఆలస్యం అవుతుంది

2. మేక, గొర్రె మాంసం తినరాదు. అలాగే ఆకుకూరలు కూడా తినరాదు.

3. పగడము ధరిస్తే ప్రమాదం. ఆకుపచ్చ రంగు వీరికి పడదు.

4. గురువును, తండ్రిని గౌరవించి ఆశీస్సులందుకోవాలి

5. గృహంలో తూర్పు దిశగా నీటి కుండలుంటే, ఆరోగ్యం దెబ్బతింటుంది.

6. నీలం ధరించాలి.

7.వీరికి జన్మ రీత్యా ఎరుపు రంగు. ఎరుపురంగు ఎక్కువగా ఉపయోగించుకోవాలి.

8. ఆంజనేయ స్వామి ఉపాసన తప్పక చేయాలి.

9.ఈ రాశి జాతకులు నోటిని అదుపులో ఉంచుకోవాలి.ఎక్కువగా మాట్లాడితే ఆపదలు కొని తెచ్చుకుంటారు.

10. పశ్చిమ సింహద్వారపు గృహంలో నివసించాలి

11. దక్షిణ దిశగా తల పెట్టి నిద్రించాలి

12. ఏ పనిచేసినా నిదానించి, ఆలోచించి చేయాలి.

13. ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూ లేదా చదువుతుండాలి.

14. ప్రతిరోజు రాత్రి రాగి చెంబులో నీరు ఉంచి తలదిశన పెట్టుకొని, ఉదయాన ఉత్తరదిశగా ఈ నీటిని పారబోయాలి.

15. పదునైన ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి.ప్రమాదాలు జరుగుతాయి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

మీన రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం …

6 comments

  1. Raja Ramesh Reddy.Bandi

    Keep going like this for the awareness of the people
    Thank you
    🙏🙏🙏🙏🙏

  2. Nice information 👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *