మొక్కులు తీర్చకుంటే కష్టాలు వస్తాయా ?

దేవుడు ఎవరి పాపాలను కానీ, పుణ్యాలను కానీ స్వీకరించడు, ఎవరి పాప పుణ్యాలను వారే అనుభవించాలి అని శ్రీకృష్ణుడు భగవద్గీత లో చెప్పాడు కదా.

 

మన కష్ట నష్టాలను,సుఖ దుఃఖాలను మన కర్తవ్య లోపాలను భగవంతునికి భాగస్వామ్యం కల్పించి ముడుపులు కట్టి దండాలు పెడితే కష్టాలు తీరిపోయి సుఖాలు కలుగుతాయా? కోరికలు తిరుతాయా? ముడుపులు కడితే మనశాంతి లభిస్తుంది అంటే కానీ కోరికలు తీరవు. దేవునికి లంచం ఇస్తే పని కాదు మన పూర్వ జన్మ సుకృతం మూలంగా జరుగుతుంది.

మనం సంసార నిర్వహణ కొరకు ఎన్నో తప్పులు, పాపాలు చేస్తుంటాము. కొన్ని సార్లు అబద్దాలు, మోసాలు చెయ్యాల్సి వస్తుంది. అలా చేసిన పాపాలు మన తల వెంట్రుకలు, ఎముకల్లో దాగి ఉంటాయి అని మన శాస్త్రాలలో, స్మృతుల్లో చెప్పినట్లు పెద్దలు చెబుతారు.

అందుకే మనం పుణ్య క్షేత్రాలకు వెళ్లి నపుడు తల వెంట్రుకలు సమర్పిస్తాం. తల వెంట్రుకలు అలా ఇవ్వటంలో అంతరార్థం అది. అంతే గాని ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటే తీరవు.మనం కష్టపడి పని చేస్తూ,మోసం చెయ్యకుండా,అబద్దాలు చెప్పకుండా ,దేవుని కార్యక్రమాలలో పాల్గొంటూ, సేవ చేస్తు ఉంటే మనం పోయిన జన్మలో చేసిన పాపం తగ్గి అపుడు మంచి జరుగుతుంది. ఇంకో విషయం ఎముకలలో ఉన్న పాపం తగ్గాలి అంటే రోజు గోమూత్రం తాగాలి.

మనం అమాయకంగా ముడుపులు కట్టి కోరికలు తీరుతాయి అని కూర్చుంటే ఇంకా కష్టాలు పెరుగుతాయి. కష్ట సుఖాలు మనుషులకు సహజం, మంచివాడు, చెడ్డవాడు,ధనవంతుడు,పేదవాడు, త్యాగి, పక్షి, పురుగు ఇవి అన్ని కూడా దేవుడి దృష్టిలో ఒకటే కాబట్టి మనం అందరికి సాయపడుతూ ఉంటే మన కర్మ తీరి మంచి రోజులు వస్థాయి.

మొక్కులు తీర్చిన తీర్చక పోయిన దేవుడు దయస్వరూపుడు తన బిడ్డలకి అపకారం చెయ్యడు. ఎందుకంటే భగవంతునికి మనం మొక్కులు తీర్చిన, తీర్చక పోయిన సంతోషం, భాద కలుగదు. కాబట్టి మన అనుమానాలు పక్కన పెట్టి భక్తితో ఆ పరమాత్మని పూజిస్తే మన గత జన్మ పాపాలు తొలిగి పోయి, అంతా మంచి జరుగుతుంది.

సర్వే జనా సుఖినో భవంతు…..

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

13 comments

 1. Tq for good information.

 2. Super information need more like these

 3. Thanks for your good information

 4. Balaji Padarthi

  Anna superrrr mes

 5. Yes, without hard working don’t expect anything. Good message.

 6. అక్షింతల పార్థసారథి

  Super

 7. Nice information

 8. A.Muni Krishna

  Super

 9. Akshintala Sakuntala

  Excellent great story 🙏🙏🙏🙏🙏🙏

 10. Oooo my god
  What a explanation
  Grate
  Thank you

 11. Good infermation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *