Breaking News

రాహు కాల దీపారాధన వల్ల ఉపయోగం ఏమిటి? రాహుకాలంలో దీపం పెడితే కష్టాలు తీరుతాయా?

రాహు కాలంలో పెట్టె నిమ్మకాయ దీపం కుజదోషం,కాలసర్ప దోష పరిహారం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో ఇబ్బంది పడే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరుపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి భాదలను తొలగిస్తుంది.

 

నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవికి చాలా ఇష్టం . నిమ్మకాయలతో చేసిన దండను పార్వతి దేవికి …గ్రామ దేవతలైన మైసమ్మ , ఎల్లమ్మ ,పోచమ్మ ,మారెమ్మ,పెద్దమ్మ, పోలేరమ్మ, అంకమ్మ ,రాజ రాజేశ్వరి మొదలైన శక్తి అవతారాలకు మాత్రమే వేస్తారు.గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి.ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి ,సరస్వతి ,మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు .ఒక వేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు .సంసారం లో గొడవలు వస్తాయి , ఆర్ధిక వ్యవహారాల్లో నష్టం కలిగి ఇబ్బంది పడతారు. భార్య భర్త , పిల్లలు ,స్నేహితులు,బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి.

పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను మంగళవారం,శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి.మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు , శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు . మంగళవారం వెలిగించే దీపమ్ కన్నా శుక్రవారం వెలిగించే దీపమ్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది . ఎందుకంటే మంగళ వారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది.శుక్రవారం వెలిగించే దీపం సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది అని శాస్త్రం. శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది .శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం (లేదా) పెసరపప్పు (లేదా) పానకం దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి.కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు, జాకెట్టు ముక్క ,చీరలు ఇస్తే దేవికి ఇంకా చాలా ఇష్టం . తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి.ఇలా చేస్తే తలచిన కార్యములు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా నెరవేరతాయి.

నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవల్సిన అంశాలు:-

1. నెలసరి బహిష్టు అయినపుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు .

2.మచ్చలు లేని వాడిపోని మంచి నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగిస్తే చాలా మంచిది.

3 మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను రాహుకాలంలో వెలిగించకూడదు.

4. మహిళలు నాలుగవ రోజు తల స్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .

5. ఇంట్లో పండుగ సమయం ,పెద్దల తిధి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను రాహుకాలంలో వెలిగించకూడదు .

6. పిల్లల పుట్టిన రోజునాడు ,పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను రాహుకాలంలో వెలిగించకూడదు .అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు .

7. స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని రాహుకాలంలో వెలిగిస్తే త్వరగా అమ్మ వారి అనుగ్రహం కలిగి అనుకున్న అన్నీకార్యాలు జరిగిపోతాయి . చీర ఎరుపు,పసుపు రంగు కలిగినవి వాడుతే మరి మంచిది. స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి . పొరపాటున కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు.ఆధునిక వస్త్రధారణ అంటే పంజాబీ డ్రెస్ ల లాంటి వాటితో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు.

8. వేరే ఊరు వెళ్లినప్పుడు మిత్రుల మరియు బంధుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను రాహుకాలంలో వెలిగించకూడదు . ఆడపిల్లలు ,అక్క ,చెల్లిళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్లినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు.

9. దీపం క్రింద తమలపాకు,లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయవలెను. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగ దూపం తప్పక వేయాలి .పూజకు ఎర్రని పూలను మాత్రమే ఉపయోగిస్తే చాలా మంచిది.బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యం గా పెట్ట వలెను.ఈ విధంగా నిమ్మకాయ దొప్పలో దీపం వెలిగించి శాస్త్ర ప్రకారం పూజ చేస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పక తీరుతాయి.

సర్వేజనా సుఖినో భవంతు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

18 comments

 1. రాహు కాల పూజ గురించి చక్కగా, మంచి వివరణ ఇచ్చినందుకు…

  ధన్యవాదాలు….🙏

  • అక్షింతల పార్థసారథి

   Very very very very

   Very very good మెసేజ్

   Ashok Kumar గారు

 2. Good information

 3. రాహు కాలదీపం గురించి చాల బాగా తెలిపారు సంతోషంగా ఉంది

 4. Perfect

 5. మల్లికార్జున రావు ఊరందూరు

  Good information

 6. మల్లికార్జున రావు ఊరందూరు

  Good information for women

 7. హరి ఆలేటి

  Good good

 8. Raja Ramesh Reddy.Bandi

  Good information
  🙏🙏🙏🙏🙏

 9. వివరణ చక్కగా వివరించారు

 10. Superabba 👍 Tq Ashok Gaaru

 11. అక్షింతల పార్థసారథి

  Very very very very

  Very very good m s g

  Ashok Kumar

 12. Gud informantion for raahukaala deepam importence for women’s Tq verymuch

 13. Dhulipalla Raghavendra Rao

  రాహుకాల దీపం వెలిగించడం వలన కలిగే ఫలితాలను చక్కగా వివరించావు అశోక్ సంతోషం

 14. Kastam lo unnapude ee deepam pettalani chala goppaga chepparu
  Ela pettali goppa vivaraka adhbutsm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *