వివాహ వివరణలు

పెళ్లి సమయంలో పాటించవలసిన 6 ముఖ్యమైన విషయములను జాగ్రత్తగా గుర్తుంచుకో వలెను.

వివాహ విషయముల గురించి:

1. ఒకే సంవత్సరము గాని, ఒకే కాలమందు గాని సహోదరిలకు(అక్క చెల్లెళ్ళ కు) వివాహము చేయరాదు.అలా చేసిన ఒకరు వితంతువ అగును.

2. వివాహం జరుగునపుడు తలంబ్రాలలో బియ్యంతో పాటు గులాబీ రెక్కలు,పూలు వేయుట చెయ్యరాదు. అలా చేసినందు వల్ల భార్య భర్తలకు ఈ జన్మలో కాని మరు జన్మలో కాని తగవులు పడుట, దూరమగుట జరుగును.కొన్ని సార్లు వారిలో ఒకరు అకాల మరణం చెందుదురు.

3.  సంవత్సరములో మొదటి ఆషాడ మాసమున కోడలు అత్త వారింటఉన్న అత్తకు గండము, క్షయ మాసమున ఉన్న తానే మరణించును. జ్యేష్ట మాసమున ఉన్న బావకు గండం. పుష్య మాసమున ఉన్న మామకు, అధిక మాసమున ఉన్న భర్తకి గండము. చైత్ర మాసమున తండ్రిఇంట నున్న తండ్రికి గండము. మిగిలిన మాసములు సుఖము కలుగును.

4. గర్భవతికి ఆరు నెలలు నిండిన పిమ్మట ఆమె భర్త గృహారంభం,  క్షౌరం చేసుకొనుట, శ్రాద్ధాన్న భోజనం చేయుట, పుణ్యతీర్ధములు సేవించుట, శవము ను మోయుట, శవం వెంట నడచుట, సంభోగం చేయుట, నదీస్నానములు చేయుట, కొండలు ఎక్కుట, దూర దేశ నివాసములు, మొదలగునవి చేయకూడదు. ఇంకా గర్భిణిస్త్రీ ఏనుగు,పర్వతాలు,మేడలు ఎక్కరాదు. దిగంభారాలై స్నాన మాడరాదు. అసుర సంధ్య వేళ భుజించ రాదు. సంభోగం చేయరాదు. గోళ్ళు కొరుకుట, గిల్లుట, ఆకులు తుంచుట చేయరాదు. మాంసం తినరాదు. గర్భిణి స్త్రీ ఏది కోరితే ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి.

5. భార్యతో ఐన పగటి పూట సంభోగించ రాదు. తన కన్నా పెద్దది ఐన స్త్రీ తో సంభోగించిన ఆయుష్షు క్షీణం.

6. పుట్టిన పిల్లవానికి 11 రోజు(లేదా) 13 రోజు నామ కారణం చెయ్యాలి. ఆరు నెలల వయస్సు వచ్చిన తర్వాత అన్న ప్రాసన చేయాలి. పురుషులకు సరి, స్త్రీలకు బేసి నెలలో అన్నప్రాసన చేయాలి

ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఖచ్చితముగా ఇతరులకు షేర్ చేయండి.

About admin

Check Also

జాతి రత్నములు

జాతి రత్నములు ధరించు విధానం 1. నవరత్న ఉంగరములు అందరు పెట్టుకొనరాదు. ఎవరికి ఏ రత్నం ధరించవచ్చునో తెలుసుకొని (అనగా …

3 comments

  1. Very good infermation…

  2. Surendra babu k

    Nice infermation for marriage s

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *