వృషభ రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి.

ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి..
వృషభ రాశి : పేరులో మొదటి అక్షరం – ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ,వు, వే, వో
నక్షత్రం : కృత్తిక 2,3,4 పాదములు వారు,రోహిణి 4 పాదములు వారు,మృగశిర 1, 2 పాదములు వారు

1. ఇది కామ శక్తికి సంకేతం, పరస్త్రీ సంగమం పనికిరాదు.

2. తూర్పు ముఖద్వారం ఇల్లు వీరికి పనికిరాదు. తండ్రి కి ఆరోగ్యభంగం.

3. ఇతరుల్ని మోసగించాలనే ప్రయత్నాలు వీరికి పనికిరాదు

4. తెలుపు రంగు వీరికి మంచిది కాదు

5. వీరి కంటే వయసులో పెద్దవారిని వీరు అవమానించకూడదు.

6. వీరికి లోహం కలిసివస్తుంది. అందువల్ల లోహం తో చేసిన విగ్రహాలు వీరు దానం చేయరాదు

7. ఉత్తర దిశలో నీళ్ళ ఆక్వేరియం పెట్టుకుంటే వీరికి లాభదాయకం.

8. బుధునికి చెందిన వస్తువులు దానం చేయాలి

9. వీరికి శత్రువులు స్త్రీలు. వీరికి దూరంగా ఉండాలి

10. భార్య పేరున వ్యాపారం సైతం వీరికి కలిసిరాదు

11. అబద్ధం ఆడకూడదు.

12. ఆయిల్ పెయింటింగ్స్, చెట్లతో కూడిన రంగులతో చేసిన చిత్రపటాలు వీరికి పనికిరావు.

13. తల్లి ఆశీస్సులున్నంతకాలం వీరికి దైవసహాయం లభిస్తుంది.

14. నూనె దానం మీరు చేయకూడదు.

15. పశ్చిమ, వాయవ్యాలలో కంచు/పంచలోహ ఆంజనేయ విగ్రహం పెడితే కలిసొస్తుంది.

16. పార్వతీ/దుర్గా/కాళీ పూజలు వీరికి భాగ్యాన్ని ప్రసాదిస్తాయి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *