శకునాలవల్ల జరగబోయేది తెలుస్తుందా? శకునాలు చూడటం మంచిదేనా ?

మనిషికి జరుగబోయే శుభాశుభాలను దేవుడు ముందుగానే తెలియ పరుస్తుంటాడని హిందువుల విశ్వాసం. అందువల్లనే చాలామంది శకునాలు చూస్తుంటారు. రాహుకాలం చూచుకొని పనులు ప్రారంభిస్తున్నారు

అయితే నక్షత్రం రాహుకాలం చూచుకొని మనం జన్మించం! ముహూర్తం చూచుకొని మరణించం! మనిషికి ఆత్మబలం సన్నగిల్లినపుడే ఇవన్నీ దగ్గర చేరతాయి. అంతే తప్ప శకునాలు చూడటం మంచిది కాదు బస్సులు, రైళ్ళు, విమానాలు శకునాలు తీసుకొని బయలుదేరవు. విధిమీద నమ్మకం లేని వాళ్ళు శకునాలు చూస్తారు.

దేవుని గుడ్డిగా నమ్మిన వాళ్ళే మూఢాచారాలు పాటిస్తారు మనిషి తనలోని లోపాలను కప్పిపుచ్చుకోవటానికి, తన తప్పులను దాచుకోవటానికీ శకునాలను అడ్డుపెట్టుకోజూస్తున్నాడు. అంతే! అంతకుమించి మరేమీ లేదు. మనం కర్మసిద్ధాంతాన్ని నమ్మినంత తేలిగ్గా కృషి సిద్ధాంతాన్ని నమ్మం.

పూర్వ ఋషులు ఎవరూ శకునశాస్త్రాలు వ్రాయలేదు. మనలను సదా నడిపించే శక్తి ఒకటి వుందని నమ్మినపుడు, తల్లిగర్భంలో వున్నపుడే మన తలవ్రాత వ్రాయబడిందని అనుకొంటున్నపుడు ఈ శకునాలతోనూ దుర్ముహూర్తాలతోనూ పనేముంది! జయాపజయాలు సుఖదుఃఖాలు మనుషులకు సహజమే కదా. దేవుడైనా, దెయ్యమైనా నమ్మ గలిగినవారికే.

ప్రశాంతంగా కూర్చుని పంచాంగాలు చూచుకొనే రోజులు పోయాయి. ప్రతిపనిలోనూ పోటీతత్వం వచ్చేసింది. గెలవగల్గిన గుర్రానికే గుగ్గిళ్ళు పెడుతున్నారందరూ. ఇది లోకం విషయంలోనే కాదు. కుటుంబంలో కూడా ఇప్పుడిలాగే వుంది. ఇంట్లో ఎవరిమాట చెల్లుబాటు అవుతుంటుందో కుటుంబ సభ్యులందరూ వారికే వంతపాడుతుండటం మనం చూస్తూనే వున్నాం కాలంకన్నా ముందుగా పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో శకునాలు చూచేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇపుడు డబ్బును చూస్తున్నారేగాని శకునాలు కాదు. లాభాలు చూచుకొంటున్నారేగాని రాహుకాలాలు చూడటం లేదు ఎవ్వరూ కాలం మారుతూతుంది. మనమూ మారకపోతే ఎగతాళి చేస్తారు అందరూ.

చిత్తశుద్ధి, సంకల్పబలం ఆత్మవిశ్వాసం వున్నవారిని ఏ శకునాలు ఏమీ చేయవు. దుర్ముహూర్తం, రాహు కాలాలు ఏమీ చేయలేవు. ఆత్మబలంతో అన్నిటినీ ఛేదించవచ్చు.కాబట్టి మీరు కూడా అన్నింటికీ శకునాలు చూసుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తారని ఆసిస్తూ..

మీ
అశోక్ కనుమళ్ల
సర్వేజనా సుఖినో భవంతు

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

8 comments

 1. Raja Ramesh Reddy.Bandi

  Very you are giving priceless information without any price
  Thank you very much 👍🙏
  Keep going

 2. Meeru cheppindi aksharaala nijam nice explanation given Tq verymuch namaste

 3. అక్షింతల పార్థసారథి

  అశోక్ కుమార్ గారు

  మీ దగ్గరనుంచి

  చాలా చాలా మంచి విషయాలు

  తెలుసుకుంటు నాము

 4. Nijamga mee nunchi chala goppa vishayalu thelusukuntunnamu meeru cheppindhi 100percent correct thankq very much

 5. Chala Baga chepparu

 6. Manasika dharyani kuda malo penchutunnaru
  Spr

 7. Have you studied or any research conducted on sakuna Shastra? Don’t comment on any sastra,if you don’t have full depth of knowledge. Sastra means it is accepted by all. Then only it will be called sastra. Physics bhowtika sastra , chemistry – rasayana sastra, vastu sastra like this all sastra s are good if you follow. Even if you follow blindly it won’t harm. It will help.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *