శివలింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు? కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చెయ్యాలి ?

 

శివునికి నిత్యపూజ జరగాల్సిందే. కావున చెయ్యగలిగితేనే శివలిం గాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. శివలింగానికి నిత్యము ఖచ్చితమైన సమ యంలో అభిషేకమూ, నివేదన జరగాలి. ఇలా నిష్టగా చేసే పరిస్థితులు పోటీ ప్రపంచంలో లేవు. కానీ శివలింగాన్ని అలా నిత్య పూజ చెయ్యలేనప్పుడు మహాశివుని ఆగ్రహానికి గురికావటంకన్నా, మీకు దగ్గరిలోని గుడిలో శివలింగాన్ని ఇచ్చివేయటం మంచిది

 

కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చెయ్యాలి?

చైత్రమాసం చెరుకురసంతో, వైశాఖ మాసము గంధంతో, జ్యేష్ట మాసం ఫలములతో, ఆషాఢమాసము క్షీరముతో, శ్రావణమాసము పంచ దారు, భాద్రపద మాసం ఆవుపాలతో, ఆశ్వయుజ మాసం అన్నంతో కార్తీక మాసము దీపాలతో (అలంకరణ), మార్గశిర మాసం నెయ్యితో పుష్యమాసం తేనెతో, మాఘమాసము నీటితో, ఫాల్గుణ మాసము పెరుగుతో అభిషేకిస్తే స్వామి సంతృప్తి చెంది కోరిన కోర్కెలు తీరుస్తాడు

 

శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాలు దర్శించుకోవాలా లేక శివుడినా?

పరమేశ్వరుని ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి చాలా మందికి ముందు ఎవర్ని దర్శించుకోవాలో అని ఒకింత సందిగ్ధత ఉంటుంది. మహేశ్వరుడు ఆదిదేవుడు. పాలకుడు. కర్తవ్యాన్ని బోధించేది శివుడు. ముందుగా శివుణ్ని దర్శించుకోవాలి లేదా నవగ్రహాలు దర్శించినా, శివుడి కరుణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శివుణ్ణి ప్రార్థించినా నవగ్రహాలు తమ స్వామిని తొలుతగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

13 comments

  1. Om namah sivaayaa super explanation given Tq verymuch

  2. హరి ఆలేటి

    Yes current

  3. Good massage

  4. Om nama sivaiaha

    • అక్షింతల పార్థసారథి

      Super Ashok Kumar

      Really nice post

      చాలా బాగా చెప్పారు

      మీ సూచనలు చాలా బాగున్నాయి

      హర హర మహాదేవ శంభో శంకర

      ఆ శివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

      • చాలా మంచి విషయం తెలిపిన్నారు సంతోషం అన్నగారు

  5. శివలింగము గురించి మరియు దాని యొక్క పూజ విధానం వల్ల కలిగే లాభాలను స్వామిజీగారూ
    చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు తెలుపు
    తున్నాను.

  6. Raja Ramesh Reddy.Bandi

    You are giving pure devotional touch and awareness to the society.. thank you very much.
    God bless you.
    👌👍👌👍

  7. Om namahsivayaa…

  8. చాలా చక్కగా వివరించారు

  9. Good information

  10. Denito ae masam lo cheyalo chepparu spr

  11. Akshi ntala. Sakuntala

    Very important

    Useful information

    Thanks B r

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *