షష్టిపూర్తి చేసుకోవడం అవసరమా? షష్ఠి పూర్తి ఎందుకు చేసుకోవాలి.?

షష్ఠి పూర్తి ఎందుకు చేసుకోవాలి?

షష్టిపూర్తి చేసుకోవడం అవసరమా?

షష్టిపూర్తి  విశిష్టత ఏంటి?

 

మనిషి తన జీవితం లో బాల్యం, కౌమారం, యవ్వనం దశలను దాటుతాడు. 60 సంవత్సరాల తర్వాత మిగిలింది అనుభవపూర్ణమైన వార్ధక్యమే! 60 ఏండ్ల నాటికి జీవితంలో చూచిన ఎత్తుపల్లాలెన్ని ! చవిచూచిన కష్ట సుఖలెన్ని! మింగలేక మింగిన భాదలెన్ని! అయిన వారి వల్ల, కాని వారివల్ల అనుభవించిన నరకాలెన్ని! భార్య చీర కొంగుతో తుడుచుకున్న కన్నీళ్లేన్ని! కొడుకు దుడుకు చేష్టలకు కుమిలి పోతు గడిపిన రాత్రులెన్ని! కూతురు తిరుగుబాటు తనానికి తిరిగి చెప్పలేక ఒంటరిగా ఏడ్చుకున్న రాత్రులెన్ని!

60 సంవత్సరాల వయస్సు అంటే 35 సంవత్సరాల దాంపత్యానుభవం, అంతకు మించిన లోకానుభవం, కొడుకులు- కోడళ్ళు -కూతుర్లు – అల్లుళ్లు-మనుమలు-మనవరాళ్లు ,అన్న తమ్ముళ్లు, అక్క చెల్లెళ్లు, వదిన మరదలు, బావ మరుదులు, బంధు మిత్రులు , ఎందరెందరో అందరూ కలసి వచ్చి ఆశీర్వదించే అద్భుతమైన, మధుర మైన వేడుక మహోత్సవమే ఈ షష్ఠి పూర్తి.

60వ సంవత్సరపు అనుభూతికి ఎన్ని రహస్యాలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని పల్లవింపులు, ఎన్నెన్ని ఊహల ఉయ్యాలలు. అందుకే “గతము తలచీ వగచే కన్నా సౌక్యమే లేదు” అన్నాడు మహాకవి సముద్రాల. “తెలియని భవిష్యత్తు కన్నా తెలిసిన గతమే మిన్న” అన్నాడు ఉమర్ ఖయ్యాం.

గతాన్ని ఒకసారి వెనుదిరిగి చూచుకొని, పగలు పంతాలు మరచి పోయి, కోపతాపాలు పక్కన పెట్టి, దూరమైన బందువుల్ని, మరచి పోయిన స్నేహితులని సాదరంగా పిలిపించుకుని చేసుకునే వేడుక (పండుగ) ఇది. యవ్వన పొగరుతో చేసిన ఎన్నో తప్పుల్ని సరిదిద్దుకొని  క్షమాభిక్షను నవ్వుతూ కోరుకునే ప్రక్షాళన సమయమిది.

మీ అనుభవాలను, మంచి చెడ్డలను మీ కంటే చిన్నవారికీ ( మీ కింద తరాలకు)  తెలియ చెప్పడానికి ఒక మంచి వేదిక.  ఇంత చక్కని సదవకాశం మరల జీవితంలో ఎ మనిషికి రాదు.

మీకు ఉన్నంతలో మీ తల్లి తండ్రులకు షష్టి పూర్తి చేయడం ప్రతి కొడుకు, కూతురు భాద్యత.

షష్టి పూర్తి అవసరం కాదు ఒక అనుభూతి. అందరితో, మీకు మీరు చేసుకొనే,  జీవితం లో ఒక్క సరి వచ్చే పండుగ

అందుకే షష్ఠి పూర్తిని అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను.

సర్వే జన సుఖినో భవంతు.

మీ

అశోక్ కనుమల్ల.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

9 comments

 1. Good news

 2. Nice information

 3. Aaha ee kaalam variki ardahamayye la chala chekkaga chepparu. anubhavalu panchukovatam
  Inka vayasulo chesina tappulaki kshamapana cheppatam

  Spr excellent

  Nta vayasu vachina sardhukupovali ani chepparu

  Maku manchi budhi ni kuda nerpistunnaru

  Grate…….

 4. ఆలేటి హరి

  మంచిది

 5. Good info… Thnks

 6. Raja Ramesh Reddy.Bandi

  Very good news intact

 7. Dhulipalla Raghavendra Rao

  షష్టి పూర్తిని గురించి చక్కగా వివరించావు అశోక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *