శ్రీ ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో 5వ కాండ.
సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి.
హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు.
సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు.
ఆపదల నివారణ కోసం, అభీష్ట సిద్ధి, సంకల్ప జయం కోసం సాంప్రదాయికంగా సుందరకాండను పారాయణం చేసే ఆచారం ఉంది. భక్తులు తమ ఇష్టానుసారం, వీలునుబట్టి పారాయణ చేస్తారు. చైత్ర, వైశాఖ, జ్యేష్ట, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ ఫల్గుణ మాసములలోను; విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులయందును; ఆది, బుధ, గురు, శుక్ర వారములలోను ఈ పారాయణ ప్రాంభించుట మంచిదని – నదీ సాగర తీరములందును, పవిత్ర తీర్ధ క్షేత్రములందును, దేవాలయములలోను, భక్తుల సన్నిధియందును, స్వగృహ దైవ ప్రార్దనా మందిరాలలోను, తులసి కోట చెంతను ఈ పారాయణము ఆచరించుట శుభ ప్రథమ్.
సుందరకాండను పారాయణం చేసే క్రమము: సంక్షేప రామాయణం, శ్రీరామావతారము, సీతాకళ్యాణము,
సీతారామోయోః సుఖజీవనము, నాగపాశమువిమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ, బ్రహ్మకృత రామస్తుతి, పట్టాభిషేకము.
ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుంది.
సుందర కాండం పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు:
1.కళ్యాణం కావాల్సిన వారికీ కళ్యాణం అవుతుంది.
2.ఆరోగ్య సంపద ఉంటుంది.
3.గృహం లో శుభకార్యాలు జరగడం కోసం
4.భార్య భర్త ల మద్య సఖ్యత కోసం
5.ఇంట్లో ఏవరు అయిన తప్పి పోయిన వారు తిరిగి ఇంటి కి రావడం కోసం
6.సంతానం కోసం
7.పిల్లల అభివృద్ధి కోసం
8.ధన ప్రాప్తి కోసం
9.అప్పులు తీరడం కోసం
10.శని దోష నివారణ కోసం
11.బుద్దిమాంద్యం తగ్గుతుంది
12.ఇంట్లో గ్రహపీడ తొలగుతుంది.
13.మనసుకు శాంతి లభించి మానసిక బలం చేకూరుతుంది..
సర్వే జనా సుఖినోభవంతు
Good Information….
Good information
Ramayanam loni sundarakanda gurinchi chala baga cheppinanduku meeku dhanyavadamulu Sir
చాల బాగా తెలిపారు సుందర కాండపారాయణం గురించి సంతోషం
చాల బాగా తెలిపారు సుందర కాండపారాయణం గురించి సంతోషం
Excellent 👌 information 👌👌👌👌 Dhanyavadhamulu
Jai Sriram
Very good information
Thank you very much
🙏🙏🙏🙏🙏
చక్కటి సందేశాన్ని ఇచ్చారు
అశోక్ కుమార్ గారు
చాలా మంచి పని చేస్తున్న
మీకు భగవంతుడు
మేలు కలుగుతుంది మేలు
సుందర కాండ గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను
Very Good information sir
Thank you
Tapaka prayatnistam