స్త్రీ దేవతలకు, క్షుద్రదేవతలకు జంతుబలులను ఇస్తే మంచి జరుగుతుందా?

దేవుళ్ళకు ప్రాణబలి ఇవ్వటం అనాగరిక సంస్కృతి. వేల సంవత్సరాల క్రితం మనుష్యులకు మాంసాహారమే ముఖ్యాహారంగా వుండేది. ఇపుడుమనం పాయసాన్నం వండి దేవునికి ప్రసాదం పెట్టినట్లుగానే అవిద్యావంతులైన ఆనాటి అనాగరికజనం జంతుబలిని సమర్పించి, తరువాత దాన్ని వండుకొని తినేవారు. ఆర్య సంస్కృతి మనదేశంలో ప్రారంభమైన తరువాత మాంసాహారం నిషిద్ధమైనదిగా భావించారు. కాని యజ్ఞయాగాదులలో మాత్రం ప్రాణివధకు ఆర్యుల సమ్మతి ఉండేది.

క్రీ.పూ. 525 శతాబ్దంలో వుద్భవించిన బౌద్ధమతం జీవహింసను బాగా వ్యతిరేకించింది. యజ్ఞయాగాదులు పశుబలితో నిర్వహించటాన్ని బౌద్ధమతం
నిరసించింది. ఎందరో రాజులు, చక్రవర్తులు, పెద్దలు బౌద్ధమత ధర్మాలను మెచ్చుకొని బౌద్ధిజాన్ని స్వీకరించారు. ఈ సమయంలోనే యజ్ఞబలులు నిలిచి పోయాయి. బౌద్ధమతానికి తోడుగా జైనమతం కూడా హింసను సంపూర్ణంగా వ్యతిరేకించింది. దీంతో వైదిక యాగాలు నిలిచిపోయాయి.

అహింసా సత్యమస్తేయం, శౌచమింద్రియ నిగ్రహః దానం

దమో దయ శాంతి: సర్వేషాంధర్మసంగ్రహః –యాజ్ఞవల్క్యస్మృతి

అహింసా జీవనం, సత్యనిష్ఠ, దొంగిలింపకుండటం, శుచిత్వం, ఇంద్రియ నిగ్రహం, దానగుణం, శాంతిపాలన, భూతదయ ఇవన్నీ మానవ ధర్మాలు. రాతియుగంలో మనుషులు కేవలం మాంసమేతిని బ్రతికేవారు గదా అది పాపంకాదా అనవచ్చు! అయితే ఆనాడు మనిషికి వావివరుసలు కూడా వుండేవికాదు. అదేవిధంగా ఇపుడు మనం జీవించగలమా! అప్పటి మనిషి మృగ సమానుడు. మృగత్వం నుండి మనుష్యత్వానికి వచ్చాంగదా! ఆలోచించే మనసు, విద్య, వివేకం, విచక్షణా జ్ఞానం వచ్చాయిగదా! ఇపుడు కూడా ఆదిమానవుల జీవితం గడపటం మంచిదికాదు గదా

ఇపుడు కూడా మారుమూల గ్రామాల్లో స్త్రీ దేవతలకు, క్షుద్రదేవతలకు జంతుబలులను ఇవ్వటం జరుగుతూనే వుంది. దేవుని పేరు మీద ప్రాణుల వధించటాన్ని విద్యావంతులైన వారందరూ అడ్డుకోవాలి. దీనికి కుల మతాల సంబంధం లేదు. అయితే మాంసాహారు లందరూ చేపలు, మాంసం మొదలైన వన్నీ మానేసి కూరగాయలు మాత్రమేతినాలా? అని అనవచ్చు.దేవాలయాలలో జంతుబలిని గురించి మాత్రమే చర్చించాను, మీ అభిప్రాయం మీది.

మనిషి తన సుఖంకోసం, తన లాభం కోసం, తన కుటుంబ శ్రేయస్సు కోసం ప్రాణులను బలి యివ్వటం బాలా గోరమైన పద్ధతి. “అహింసా పరమో ధర్మహ అహింస తో జీవించటంకన్నా మించిన ధర్మం మరొకటి లేదు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

10 comments

 1. మల్లికార్జున రావు ఊరందూరు

  ఆచారము

 2. Raja Ramesh Reddy.Bandi

  Puraathana aachaaraala gurinchi baagaa chepperu
  Thank you
  🙏🙏🙏🙏🙏

 3. Ahimso paramadharmaha excellent 👌 👌👍👍

 4. అక్షింతల పార్థసారథి

  Thank Q

  Wonder full

  Message

  My dear

  Ashok Kumar

  Good night

 5. Mudhanammakala gurinchi baga chepparu

 6. Exalent swamy

 7. Good information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *