Breaking News

హతాజోడీ అంటే ఏమిటి ? హతాజోడీ మీ ఇంట్లో పెట్టుకుంటే ఏమి జరుగుతుంది ?

హతాజోడీ అంటే మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు. మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ కొండలలోను మరియు నేపాల్ లుంబిని లోయలోను ఎక్కువగా కనబడుతుంది.ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి , ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది.

హతాజోడి వేరుని నువ్వుల నూనెలో ఉంచితే ఒక నెలలో కిలోన్నర దాక నూనెని స్వీకరిస్తుంది. హతాజోడి వేరు చుట్టు కొంత కొవ్వు కలిగి పెద్ద సైజులో ఉంటుంది.నూనెలో వేసిన తరువాత నూనెను పీల్చి చిన్న సైజులోకి వస్తుంది.

మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుతారు. హతాజోడి వేరుని ప్రత్యేకమైన అమావాస్య ఆదివారం ,లేదా మంచి రోజు మంచి నక్షత్రం రోజు  సేకరిస్తారు. ఈ మొక్క కాండాన్ని కలిగి ఉంటే దుష్ట శక్తులు వెళ్ళిపోతాయని, చాముండేశ్వరీ దేవి స్వరూపమని, అది ఇంట్లో ఉంటే అదృష్టమని కొందరు భావిస్తారు. తాంత్రికులు ఈ మొక్క వేరుని రెండు చేతులు నమస్కారం పెట్టినట్లుగా తయారుచేసి మార్కెట్టులో “హతాజోడి” అనే పేరుతో అమ్ముతారు.ఈ మొక్క వేరుకి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది.ఎందుకంటే ఇది మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకదు.

హతాజోడి కి పూజా విధానము తెలుసుకుందాం.
పూజకు కావలసినవి : హతాజోడి ,యాలకులు,లవంగాలు ,కర్పూరం ,పసుపు, కుంకుమ, జవ్వాజి,కస్తూరి, ఎర్రచందనం,పునుగు,  జపమాల, సింధురం, ఎరుపు రంగు పుష్పాలు, సాంబ్రాణి, శ్రీ యంత్రం గాని అష్టలక్ష్మి పీటం గాని, పూజకు ముందుగ హొమ పాత్రని గాని,మట్టితో హొమ పాత్రని గాని సిద్దం చేసుకోవాలి. ఉదయం స్నానం చేసిన తరువాత హతాజోడిని శ్రీ యంత్రం మీద చేతులు మనవైపుకు చూస్తున్నట్టుగా పెట్టి పసుపుతో,సింధూరం కలిపి,జలం తో కలిపి హతాజోడికి పూయాలి.కుంకుమతో బొట్లు పెట్టాలి.కర్పూరం,సాంబ్రాణితో ధూపం చూపిస్తూ జపమాలతో 108లలితా సహస్త్ర నామాలతో “ఓం చాముండాయై నమః” అనే మంత్రంతో గాని “ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయైనమః “అనే మంత్రంతో గాని ,ఎర్రని పుష్పాల తో,జవ్వాజి,కస్తూరితో హతాజోడిని తడపకుండా చిలకరిస్తు పూజ చేయాలి.యాలుకులు,లవంగాలతో నైవేద్యం పెట్టాలి.
         చాముండేశ్వరీ మంత్రోచ్చారణ ప్రారంబించే ముందు “ఓం సర్వమంగళ మాంగళ్యే శివేసర్వార్ధసాదకే శరణ్యేత్రయంబికే దేవీ నారాయణ నమోస్తుతే”అను మంత్రాన్ని మూడు సార్లు జపించాలి.ఇలా పూజ చేస్తే అన్ని సమస్యలు తీరుతాయి అని నమ్మకంతో చెయ్యాలి.
   

ఈ హతాజోడీ మీ వద్ద ఉంటే ఉపయోగాలు ఏమిటో తెలుసు కుందాం.
1. మీకు రాజకీయాలలో గుర్తింపు లభిస్తుంది. జన సహకారం,మంచి వాక్ శుద్ధి ఏర్పడుతుంది.

2. హతాజోడీ ఉన్న ఇంటిలో ,మీరు ఉంటే ఎటువంటి తాంత్రిక ప్రయోగాలు మీ మీద పనిచేయవు,నరధృష్టి ప్రభావాలు పనిచేయవు.

3. అప్పుల భాదలు,కోర్టు సమస్యల నుండి విముక్తి కలుగుతుంది.

4. శత్రువులపై విజయాలు లభిస్తాయి,ఇంటిలో పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం లభిస్తుంది.

5.ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధనాభివృద్ధి కలిగి ,అదృష్టం బాగా కలసివస్తాయి.

6. హతాజోడీ ఉన్న ఇంటిలో అందరికి మానసిక ప్రశాంతత లభించి ,అందరి మద్య ఎటువంటి కలతలు,గొడవలు ఉండవు.

7. జాతకంలో ఎదురయ్యే గ్రహ భాదల నుండి విముక్తి లభిస్తుంది. పాపా గ్రహాలైన శని,కుజ గ్రహాల భాదల నుండి ఉపశమన కలుగుతాయి.

8. దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్న వారు హతాజోడిని పూజ చేసి ఇంటిలో పెట్టుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుంది.

9. కొన్ని సమయాలలో ఎంత సంపాదించిన సమయానికి చేతిలో డబ్బులు ఉండవు.అలాంటి సమయాలలో హతాజోడిని పూజ చేసి బీరువాలో గాని లాకర్ లో గాని పెట్టుకుంటే సమయానికి డబ్బు సమకూరుతుంది.

ఏది ఏమైనా హతాజోడీ మీరు ఇంట్లో పెట్టుకుంటే ఇవన్నీ జరుగుతాయా ? లేదా ? అని ఆలోచించకుండా నమ్మకంతో పెట్టుకుంటే అన్ని మంచి జరుగుతాయి.ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు కాబట్టి అందరూ హతాజోడీ కి పూజ చేసుకొని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి

లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది. కర్పూరాజ లింగం: మానవులకు …

7 comments

 1. Chala arudaina vishayam asalu malantivariki theliyani vishayam cheppinanduku dhanyavadamulu meeku

 2. చాలా మంచి ఇన్ఫర్మేషన్
  నేను చాలా విన్నాను, నార్త్ రాష్ట్ర ల లో ఈ మొక్కకు చాలా డిమాండ్ ఉంది.
  నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను

  దయచేసి
  ఈ మొక్క ఎక్కడ చిక్కుతుంది
  ఎంత అవుతుంది?

  చెప్పా గలరా

 3. Arudyina chettu gurinchitheliyachesaaru . excellent 👌👌👌 really superb sir

 4. సూపర్ మెసేజ్ చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు

 5. మల్లికార్జున రావు ఊరందూరు

  Amazing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *