భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చా ? స్వర్గానికి నేరుగా వెళ్లాలంటే రోడ్ మార్గం ఎక్కడుందో తెలుసా

1. భారతంలో పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. కొంత మంది పరిశోధకులు కూడా నిజమే అంటున్నారు. భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదేనట.

2. మన భారతదేశంలో బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం. భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే దాదాపుగా ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది.

3. ఈ గ్రామం చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది. ఈ సరస్వతి నది పక్కన భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.

4. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు. ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి. ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.

5. మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది. తరువాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి  అని చెప్తారు. ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

6. తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

7. ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక వసుధార జలపాతం వస్తుంది. ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది. ఇక్కడ గాలులు బలం గా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది. అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

8. తర్వాత చట్మోలి ( 12,000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం. పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం. ఇక్కడే “సతోపంత్” మరియు భగీరధథ్ కర్క్ అనే రెండు నదులు ( హిమానీనదాలు ) కలిసి “అలకనంద” గా ఏర్పడతాయి.

9. అక్కడి నుండి ముందుకు వెళితే “ధనో హిమానీనదం” కు చేరుకుంటాం. తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఎంతో ఆహ్లాదం గా ఉంటుంది. ఇక్కడే లక్ష్మి , విష్ణువు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు. ఇక్కడే ద్రౌపది తనువు చాలించింది అని చెప్తారు.

10. ఇక్కడి నుండి 2km ప్రయాణించాక బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం. ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు. బంధర్ నుండి సహస్రధార 4km ( 14,000 అడుగుల ఎత్తులో), సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15,000 అడుగుల ఎత్తులో) ఉంటుంది. చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు. ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.

11. చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km వుంటుంది. ఈ “సతోపంత్” అనేది త్రిభుజాకృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే సరస్సు. ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు. ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చు. ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

12. సతోపంత్ నుండి స్వర్గారోహణం 8 km ఉంటుంది. ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సాహసం గాను చెప్తారు. మార్గం లో చంద్రకుండ్, సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయి. ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే కుక్క తోకలసి స్వర్గానికి ప్రయాణించాడు అంటారు. నిజానికి “స్వర్గారోహిణి” అనేది 6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది. ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది. దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.

13. ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అడుగుల ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.కానీ ఇది నిజమా కాదా అని మీమాంసకు పోకుండా, మనం నమ్మి తీరాలి.ఎందుకంటే ఎంతో మంది సాధుపుంగవులు,దైవంశ సంభూతులు ఈ స్వర్గానికి మార్గం ఉంది అని చెప్పటం జరిగింది.దీనిని నేను కూడా కొందరి పుణ్యాత్ముల దగ్గర సేకరించడం జరిగింది.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

9 comments

  1. సూపర్ గా చెప్పారు సంతోషం

  2. Wonderful information…

  3. Wow wonderful information 👌👌👌👌.

  4. మల్లికార్జున రావు ఊరందూరు

    అద్భుతమైన సమాచారం

  5. Nice information

  6. What i do not understood is actually how you are now not really a lot more well-appreciated than you may be now. Tanitansy Davie Vitus

  7. చాలా బాగా చెప్పారు చూడాలని ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *