ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉన్న ఫోటో ఉండకూడదు. లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి.ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి.నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి.
లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రములు చదివినందు వలన మనకు ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంటే సంతానలక్ష్మి స్తోత్రం చదివిన అందువల్ల సంతానం కలగడం, ధనలక్ష్మి పూజించడం వల్ల ధనలక్ష్మి స్తోత్రములు చదివినందు వలన ధన బాధలు రుణబాధలు తీరుతాయి. సౌభాగ్య లక్ష్మి స్తోత్రములు చదివినందువలన మాంగల్య దోషములు పోతాయి. ధాన్యలక్ష్మి స్తోత్రములు చదివినందువలన సమృద్ధిగా ఆహారం లభిస్తుంది ధైర్యలక్ష్మి కి సంబంధించిన స్తోత్రములు చదివినందు వలన ఎటువంటి భయములు ఉండవు. విజయలక్ష్మి స్తోత్రములు చదివినందు వలన అన్నింటిలో విజయం సాధించి అపజయం ఎరుగని జీవితాన్ని గడుపుతారు. విద్యాలక్ష్మి స్తోత్రములు చదివినందువలన విద్యలో బాగా రాణిస్తారు. ఏది ఏమైనను లక్ష్మీదేవి స్తోత్రములు చదివినందువలన మన జీవితంలో అన్ని బాధలు తీరి సుఖవంతమైన జీవితమును గడపగలరు అందులోనూ దీపావళి రోజున నరకచతుర్దశి రోజున గాని ఈ లక్ష్మీ స్తోత్రములు చదివినందు వలన ఆమెకి బాగా ప్రీతి పాత్రులగుదురు. కాబట్టి ఈరోజు మీకు ఇష్టమైన లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రములు చదువుకొని ఆనందంగా ఉండండి.
Click Here Below
Marvelous….
Deepavali Subhakamkshalu, Guruvu Garu