మనం తెలీక చేసే తప్పుల వల్ల రావాల్సిన అదృష్టం రాదా ? ఏమిటా తప్పులు ? ఆ తప్పులకు పరిష్కారం తెలుసా

1. పూజాదికాలు (ధూపదీప నైవేద్యాలు) జరపవలసివున్న శక్తివంతమైన వస్తువులు ఉంటే వాటిని అలావదిలేయడం ఎవరికీ క్షేమం కాదు. కనీసం వాటికి దీపమైనా పెట్టాలి. లేనట్లయితే ఆ వస్తువుల్లోని శక్తి ఎదురు తిరుగుతుంది.

2. ఆరాధన పరంగా నిరాదరణ జరగడం అంటే కనీసం జరపవలసిన అర్చావిధిని సైతం పట్టించుకోక నిర్లక్ష్యం చేయడమన్నమాట! ఇటువంటి పరిస్థితి ఏకుటుంబానికైనా ఎదురైతే, సదరు గొప్ప శక్తివంతమైన వస్తువులను నిష్టగా ఆరాధించగల మరొక ప్రదేశానికి (అది కుటుంబం కావచ్చు దేవాలయం కావచ్చు!) తరలించాలి. అంతేగాని అటువంటి వాటిని నిరాదరణకు గురిచేయరాదు.

3. చాలామంది ముచ్చటకోసం గణపతి విగ్రహాలను (పూజా నిమిత్తమే అనుకోండి) మట్టి / ప్లాస్టరాఫ్ పారిస్తో రూపొందించినవి కొని పూజానంతరం వాటిని నిమజ్జనం చెయ్యకుండా ఇంట్లోనే అలమార్లలో అట్టిపెట్టుకుంటారు. ఇది చాలాదోషకరం, తప్పని సరిగా అది నీటిలోకి జారవిడవాల్సిందే లేనట్లయితే ఆ గృహమున సుఖశాంతులు లోపిస్తాయి.

4. సైన్స్ కు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలినా, ఒక అద్భుతం మాత్రం ఉంది నెలనెలా బహిష్టయ్యే స్త్రీలున్న ఇంట్లో పూజగది ప్రత్యేకంగా ఉండితీరాలి. శక్తివంతమైన వస్తువులు గాని ఉంటే అవి పూజగదిలోనే భద్రపరచాలి అంతేగాదు! వాటిని ఆయా కాలపరిమితి (5 రోజులు) లో స్త్రీలు ఆగదివైపు వెళ్ళడంగాని వాటిని తాకడంగాని పనికిరాదు.

5. ఇక్కడ ఇంకో విషయం స్పష్టం చేయవలసి ఉంది. మంత్రజపం (దేని నిమిత్తమైనా) జరుగుతున్న కాలంలో కూడా ఇటువంటి ఋతుధర్మం కొనసాగుతున్న స్త్రీలు ఆ వంకకు వెళ్ళరాదు. కొన్ని ప్రత్యేక పూజలలోనైతే వీరి దర్శన – స్పర్శన – వాక్కులకు సైతం నిషేధం విధించాయి ప్రాచీన గ్రంధాలు.

6. పంచలోహ విగ్రహాలు, వెండి – వైట్ మెటల్ లో రూపొందించిన విగ్రహాలు పూజనిమిత్తం ఉపయోగిస్తే వాటిని నీట్లో వదలనవసరం లేదు. వాయవ్యంలో వీటిని ఉంచడం వల్ల దోషాలుండవు. ఒకవేళ ఏదైనా దోషం సంభవించినా చంద్రుని వల్ల అవిహరించబడతాయి.

7. రావి, మర్రి వంటి వృక్షాల నుంచి తీసుకొచ్చిన పత్రాలు పూజనిమిత్తం ఉపయోగించాక (ముఖ్యంగా గణపతి నవరాత్రులలో) ఎక్కడపడితే అక్కడ పారవేయరాదు. దగ్గరలో వున్న జలవనరుల్లోకి వదిలివేయాల్సి వుంటుంది.

8. నేలపైన కాలితో గాని, బొటనవ్రేలితో గాని గీతలు గీయకూడదు. అది దారిద్ర్య సూచకం.

9. పూజ చేసేటప్పుడు మనం కూర్చునే ఆసనం, దేవుడ్ని ఉంచిన ఆసనం కన్నా ఎత్తుగా ఉండరాదు.

10. ఆసనం(చాప, పీట,జింక చర్మం )ఏదో ఒకటి వేసుకోకుండా పూజ చేయరాదు. ఎందుకంటే మనం చేసే పూజవల్ల లభించే పుణ్యఫలం భూమిపరం అయిపోతుంది.

11. అదే పనిగా ఎవరిని తిట్టకండి. వారి పాపాలన్నీ తిట్టిన వారికి బదిలీ అవుతాయి.

12. చినిగిన వస్త్రాలు దానం చేస్తే మీకు కీడు ఎక్కువ అవుతుంది.

13. అన్నం వడ్డించే సమయంలో పిల్లల్ని తిట్టడం కొట్టడం చేయరాదు. అలా చేస్తే చివరి దశలో అట్టివారికి పిల్లలు దగ్గరలో వుండరు.

14. లోపల వేసుకునే బనీను తిరగేసి వేసుకుంటే ఇక ఆ రోజుకి తిరిగి సరి చేయవద్దు.అలా చేస్తే ఆ రోజు కార్యాలు చెడిపోతాయి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు …

11 comments

 1. 👍👍👍👍👌👌

 2. మల్లికార్జున రావు ఊరందూరు

  మంచి విషయాలు చెప్పారు

 3. Wow superrrr information 👌👌👌👌👌

 4. చాల చక్కటి విషయాలు చెప్పారు సంతోషం

  • అక్షింతల పార్థసారథి

   శుభోదయం
   మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ
   చాలా మంచి విషయాలు చెప్పారు
   నమో భగవతే వాసుదేవాయ
   సమస్త మంగళాని భవతు శుభమస్తు

 5. మనం తెలియకుండా చేసే తప్పులను
  మరియు దేవతల గురించి సంప్రదాయ పద్ధతుల్లో ఏ విధంగ పూజాదికాలు ఆచరించాలో మనకు
  తెలియని విషయాలు తెలియజేసినందుకు
  అశోక్ స్వామిజీగారికి కృతజ్ఞతలు 🙏🙏🙏

 6. Chala Manchi Vishayalu Cheppinanduku Thanq Very Much Sir

 7. Thanks Ashok Sir

 8. ఏ ఏ దేవతలకు మరియు దేవుళ్లకు ఏ విధమైన పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మరియు కొన్ని సూచనలు గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను 🌹🌹🙏🙏🙏🙏

 9. చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు

 10. చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *