రుద్రాక్షధారణ వల్ల పాపాలు నశించి జనాకర్షణ కలుగుతుందా

1. రుద్రాక్ష ధారణ వల్ల భగవదనుగ్రహం ప్రాప్తించి, ధారణ చేసిన వ్యక్తి యొక్క సమస్తపాపాలూ హరించబడతాయి

2. రుద్రాక్షలు ధరించినవారికి సంపదకు, ఆరోగ్యానికి జీవితంలో లోటుండదు.

3. రుద్రాక్షలకు ప్రధానంగా త్రివిధ ఉపయోగాలున్నాయి. అందులో మొదటిది – ఆధ్యాత్మ ప్రయోజనం (అద్భుత యోగసాధన, విజ్ఞానాభివృద్ధి) రెండవది- మానసిక ప్రయోజనం (మనోరుగ్మతలు, ఏకాగ్రత లోపించుట) మూడోది దైహిక ప్రయోజనం (శరీరానికి సంబంధించిన రకరకాల బాధలు నివారణ)

4. రుద్రాక్షలు పూజించబడేచోట ధనం స్థిరంగా ఉంటుంది. అన్ని రుద్రాక్షలు ప్రభావరీత్యా గొప్పవే! కాని వీటి ప్రత్యేకత వీటి ముఖాలను బట్టి ఉంటుంది.

5. ఏకముఖి రుద్రాక్ష మాలధారణ రక్తపోటును నియంత్రిస్తుంది,దశముఖి రుద్రాక్షపూజ వాస్తుదోష పరిహారకరం, దారిద్ర్య వినాశకరం.

6. గ్రహాలలో సూర్యుడు, మునుల్లో కశ్యపుడు, నదులలో గంగ, మూలికలలో రుద్రాక్షమాలిక (జపనిమిత్తం, ధారణ నిమిత్తం వేర్వేరుగా) ఉత్తమమైనవి.

7. రుద్రాక్ష థెరపీ’ (ఒక ప్రత్యేక వైద్యవిధానం) ని రెమెడియల్ అస్ట్రాలజీలో ఒకభాగంగా చేసి, కొన్ని రుగ్మతలకు చికిత్స చేస్తున్నారు. చరక సంహితలోను – ఆరోగ్య రీత్యారుద్రాక్షను చెప్పారు.

8. రుద్రాక్షకు సభావశీకరణం, జనాకర్షణ వంటి ప్రత్యేక ప్రయోజనాలు సైతం ఉన్నాయి.

9. ఒక అంచనా ప్రకారం… రుద్రాక్షలో భేధాలు 38. ఏ రకమైనదయినా రుద్రాక్ష ధారణ, స్మరణ, పఠనం పరమేశ్వరానుగ్రహ పరిపూర్ణలభ్యతకు నిదర్శన0.

About Ashok Kanumalla

Ahsok

Check Also

రుద్రాక్షలు స్త్రీలు ధరించవచ్చా ?

పవిత్ర రుద్రాక్షలు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు ధరించవచ్చు. విష్ణు భక్తులకు యజ్ఞోపవీతం ఎంత గొప్పదో శైవ భక్తులకు రుద్రాక్ష …

7 comments

 1. హరి ఆలేటి

  Good information tq ashok

 2. శివుని కంఠంలో ఉండే రుద్రాక్షలు మరియు
  దాని యొక్క విశిష్టతలు వాటిని ఎలా ధరించితే
  ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయో స్వామీజీ
  తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.🙏🙏🙏

 3. Wow super explantion for rudhrakha i 👌👌👌👌

 4. మల్లికార్జున రావు ఊరందూరు

  మంచి శుభము .

 5. Thanks Ashok Anna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *