- లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది.
- కర్పూరాజ లింగం: మానవులకు ముక్తి ప్రదమైనది .
- భస్మమయలింగం: ఈ లింగాన్ని భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
- శర్కరామయలింగం: మానవ జీవితం సుఖప్రదం.
- సద్భోత్థలింగం: మనకు అత్యంత ప్రీతిని కలిగిస్తుంది.
- పాలరాతి లింగం: మానవులకు ఎంతో ఆరోగ్యదాయకం.
- వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు. మగ సంతానం కలిగే దానికి ఎంతో ఉపయోగపడుతుంది.
- కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది. అంటే మనకు విజయం లభిస్తుంది.
- పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది. అంతేకాకుండా జ్ఞానోదయం సమయస్ఫూర్తి పెరుగుతుంది.
- దధిదుగ్థలింగం: మానవులకు కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది. రాజకీయాల్లోనూ సినిమా రంగంలో ఉన్న వాళ్లకు బాగా పనికి వస్తుంది.
- ఫలోత్థలింగం: అనుకున్న ప్రతి పని ఫలప్రద అవుతుంది.
- ధాత్రిఫలజాతలింగం: ఇహలోకం నుంచి తప్పించి ముక్తిప్రదం కలిగిస్తుంది.
- గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు. నేరుగా పెట్టవలెను.
- దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది. పూర్ణ ఆయుష్షు కలిగిస్తుంది.
- వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం ఉంటుంది.
- ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది. కోరిన కోరికలను తీరుస్తుంది.
- సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది. స్వర్గ లోకము మోక్ష లోకము కలుగజేస్తుంది.
- రజతలింగం: సంపదలను కలిగిస్తుంది. ధన కనక రాశులను వజ్ర వైడూర్య మాణిక్య మరకత వస్తువులను దరిచేరనిస్తుంది.
- ఇత్తడిలింగం – కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.
- ఇనుములింగం – సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది. విజయం వరించేటట్లు చేస్తుంది.
- అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.
- గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
- పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
- నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
- రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.
- ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
- తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
- తుసషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.
- స్పటికలింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
- సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు.
కాబట్టి మీకు ఏ విధమైన కోరికలు ఉంటే ఆ లింగమును చేసుకొని మీ కోరికలు నెరవేర్చు కుంటారని అనుకుంటున్నాను.
సర్వేజనా సుఖినో భవన్తు
Maki basmaya Shiva ligam kavalante ela
సదాశివాయ…
సదా లోక కళ్యాణ కారణాయ…
సదా సృష్టి సంరక్షకాయ…
సర్వ జీవ పోషకాయ…
ఆరోగ్య ప్రదాయ…
అంబ సమేతాయ…
మహాదేవాయ…
మంగళప్రదాయ…
హర హర మహాదేవ
మంగళం… నిత్య శుభ మంగళం తండ్రి నికు నిత్య జయ మంగళం…
మహాదేవా శంభో శరణు…
Superrrr excellent 👌👌 information 👌👌
Thank you Ashok Anna
ఏ ఏ శివలింగము లను ఏ విధంగా పూజిస్తే ఏ ఏ విధములైన ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని వివరిస్తూ తెలియ జేసిన అశోక్ స్వామిజీగారు ధన్యవాదాలు తెలుపుతున్నాను
శివలింగాలగురించి చాలబాగ చెప్పారు
Good info