Breaking News

ప్రతి ఒక్కరు మీ కుటుంబ సంక్షేమం కోసం ఈ రెమెడీలు ఆచరించండి

1. రాత్రి నిద్రించేటపుడు, మంచం తలదిక్కు వైపు ఒక పాత్రలో నీటిని ఉంచి, మరునాడు ఉదయం ఆ నీటిని పవిత్ర ప్రదేశంలో/చెట్లకు పోయవలెను.

2. కుటుంబసభ్యుల సంఖ్యకు సమానమైన కొలత (కిలోల/ గ్రాముల)తోబియ్యం గోవులకుగాని, పెంపుడు జంతువులకుగాని ఆహారంగా తినిపించాలి. వారానికోసారి కనీసం ఇలా చెయ్యవలెను.

3. మనం ఆహారానికి కూర్చొనేటపుడే, మన కంచంలోంచి మూడు ముద్దలు తీసి వేరేగా పెట్టి, భోజనానంతరం కాకులకు వెయ్యాలి. ఎంగిలి మెతుకులను విదల్చరాదు. తినలేక కంచంలో వదిలేసినవి విదల్చకూడదు.

4. ఏడాదికోసారి పారుతున్న నదీజలాల్లో బెల్లాన్ని ప్రవహింపజేయాలి.

5. అపుడపుడు అలాగే వీధిలోని కుక్కలకు చపాతీలు తినిపించాలి

6. ఉచ్చస్థితిలో గ్రహాలున్నప్పుడు వాటికి సంబంధించిన వస్తువులు దానం ఇవ్వకూడదు. నీచస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయా గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

7. దాహార్తులై మీ ఇంటికి ఎవరైనా వస్తే, తప్పనిసరిగా నీళ్లు ఇవ్వండి.అడిగి మరీ నీళ్లు ఇవ్వండి.

8. స్ఫటికలింగాన్ని సంపాదించి పాలతో అభిషేకం చేస్తూండండి.

9. కార్తీకమాసంలో పూర్ణిమ రోజున 108 వత్తులను ఆవునేతితో దీపారాధన చేయండి.

10. సూర్యోదయ వేళ కనీసం అరగంట పాటు అయినా సింహ ద్వారాన్ని తెరచి ఉంచాలి అదే సమయంలో పెరటి ద్వారాన్ని మూసి ఉంచాలి అంటే ఇంట్లోకి పాజిటివ్ శక్తుల్ని ప్రవేశపెట్టడం అని అర్థం.

11. బహిష్టు స్త్రీలు, ఇంటి మొక్కలు బ్రహ్మ స్థానం, పూజా మందిరాలు వైపు కనీసం వెళ్లకుండా నైనా జాగ్రత్తపడాలి.

12. కుడి చేతితో చేయాల్సిన పనులు ఎడమ చేతితో, ఎడమ చేతితో చేయాల్సినవి కుడి చేతితో చేయకూడదు.

13. తల్లి తండ్రి గురువు… వీరు కూర్చున్న సమయంలో వీరికంటే ఉన్నతాసనం పైన కూర్చోరాదు అది క్షేమ దాయకం కాదు.

14. చిరిగిన వస్త్రాలు దానం గా ఎవరికీ ఇవ్వవద్దు. అది మంచిది కాదు. పాతవి అయినప్పటికీ చిరగని వాటిని దానం ఇవ్వండి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు …

7 comments

  1. Nice information 👌👌👌👍

    • మాకు తెలియనవి మీరు తెలియచేసిన్నందుకు మీకు థన్యావాదాలు అన్నగారు

      • సార్ విదేశీ ఉద్యోగం ప్రయత్నం సఫలం కావాలంటే ఏమి చెయ్యాలి?

  2. Chala chakkani upayogakaramaina andaru cheyagaliginavi cheppinanduku meeku danyavadhamulu

  3. Very nice infermation

  4. Super massage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *