దేవుళ్లకు ఏ ఫలాల నైవేద్యం పెడితే ఏ ఫలితం వస్తుందో తెలుసుకోండి

దేవుళ్ళ కి ఏ కాయలను, ఏ పండ్లను నైవేద్యంగా పెడితే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని ఆ విధంగా చేసుకుంటే మీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ క్రింద ఇచ్చిన ఫలములు దేవునికి సమర్పించుకుని కోరికలు తీర్చుకొని మీరు ఆనందాన్ని పొందగలరు.

 • ఆపిల్ పండు – దేవుడికి ఆపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. పది మందికి సహాయం చేసే స్థాయికి వెళ్తారు.
 • కమలా పండు. –  దేవుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. చేసే ప్రతి పనికి అడ్డంకులు తొలగిపోతాయి.
 •  కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) – దేవుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే,మనం మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి అట.
 • అరటి పండు – దేవుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.పెద్ద అరటిపళ్ళు సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయి.
 • నేరెడు పండు. – శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.ఇంక మరల ఒంటి నొప్పులు ఉండవు.
 • ద్రాక్ష పండు. – దేవుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. అన్నింటా కార్యజయం కలుగుతుంది.
 • మామిడి పండు. –  దేవుడికి మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. అంతటి మహిమ మామిడిపండును దేవుడికి పెడితే ఉంటుంది.
 •  అంజూర  పండు. – దేవుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి అనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు. పూర్ణ ఆయుష్షు కలుగుతుంది.
 • సపోట పండు. – దేవుడికి సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి. పెండ్లి త్వరగా జరుగుతుంది.
 •  ఆపిల్ పండు – దేవుడికి ఆపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. పది మందికి సహాయం చేసే స్థాయికి వెళ్తారు.
 • కమలా పండు. –  దేవుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. చేసే ప్రతి పనికి అడ్డంకులు తొలగిపోతాయి.
 • పనసపండు –  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. శత్రువుల అనేవాళ్ళు అసలు ఉండరు. మిత్రులు మాత్రమే పెరుగుతారు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

3 comments

 1. Very good information

 2. Dhulipalla raghavendrarao

  Very good

 3. Thanks for the valuable information Ashok Sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *