Breaking News

స్నానం ఎంతసేపు చెయ్యాలి ? స్త్రీ పురుషులు స్నానం ఎలాచెయ్యాలి

మనం స్నానం ఎంత సేపు చెయ్యాలో తెలుసుకుందాం

ప్రతీరోజు అరగంటైనా స్నానం చేస్తే చాలా మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి, సున్నిపిండిలాంటి వాటితో శుభ్రంగా రుద్దుకొని ఆపై 7, 8 చెంబులతో శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. మెత్తటి టవల్తో దేహాన్ని అద్దుకొని తుడుచుకోవాలి. స్నానం తరువాత దేహంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవటంవల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశములున్నాయి. కనుక శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ క్రింద ఓ నిమిషంపాటు నిల్చుని ఆపై బట్టలు ధరించండి.

ప్రభాతవేళ 4, 5 గంటమధ్య చేసే స్నానం ఋషి స్నానం అంటారు. తర్వాత ఉదయం 5,6 గంటల మధ్య చేసేది దైవ స్నానం అంటారు. ఉదయం 6,7 గంటల మధ్య చేసేది మానవ స్నానం అంటారు. ఇంక ఆ తరువాత చేసేది రాక్షస స్నానం అంటారు.

స్త్రీ స్నానము ఎలా చేయాలి అంటే….

స్త్రీ స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒంటి మీద నూలు పోగు లేకుండా చేయాలి. స్నానం చేసేటప్పుడు తన జుట్టును ముడివేసు కోవాలి. స్నానం ఎక్కువ సేపుచేయాలి. స్నానము అయిన తరువాత ముందు ముఖాన్నీ ఆ తర్వాత వక్షస్థలాన్ని ఆపై తలను, అటుపిమ్మట మిగతా భాగములు తుడుచుకోవాలి. స్నానం చేసిన వెంటనే చూపుడు వ్రేలు ఉపయోగించకుండా బొట్టుపెట్టి కోవాలి.

పురుషుడు స్నానం ఎలా చేయాలి అంటే…..

స్నానమంటే హడావుడిగా 4చెంబులు నెత్తిన పోసుకొని వచ్చెయ్యటం కాదు. కొంత మంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు. స్నానం అలా చేయకూడదు. అన్ని స్నానాల కన్నా సముద్రస్నానం శ్రేష్టం. ఎందుకంటే ఉప్పు నీటిలో స్నానం ద్వారా మన శరీరంలోని అనేక మలినాలు తొలగిపోతాయి. రెండవది నదీ స్నానం. వేకువజామున నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి. నదీ జలాలు కొండ, కోనల, చెట్టు చుట్టూ పుట్టలనూ తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీజలాల్లో కలుస్తుంది. అందుకనే నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది. ఆరోగ్యవంతమైనది. ఇక చివరిది ఇంటి స్నానం. అతి వేడి నీటితోగానీ, అతి చల్లటి నీటితోగానీ స్నానం చేయకూడదు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి, శరీరం లోపల వున్న అవయవాలకి ఎంతో సేవ తీరుతుంది .మగవారు మొండి మొలతో స్నానం చేయరాదు. కనీసం గోచి అయిన ధరించాలి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

పాలను ఉప్పును తెలీక తొక్కితే పాపం చుట్టుకుంటుందా ? పాలు సమృద్ధిగా ఉన్న ఇంట్లోకి శనీశ్వరుడు దరిద్రదేవత ఎందుకు రారు ?

పాలను త్రొక్కితే పాపం చుట్టుకుంటుందనేది మన పెద్దల మనకు చెప్పిన విషయం .దాని గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి పాలలోనే పుట్టింది. …

6 comments

  1. Tappaka patistam
    Thanku for information

  2. చాలా మంచి విషయాన్ని అందించారు

  3. Dhulipalla Raghavendra Rao

    Good information ashok

  4. మోహన్ కిషోర్ నిమ్మా

    అన్న చాలా మంచి విషయాలు తెలియ జేస్తున్నారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న 🙏🙏🙏

  5. Good infermation sir chala manchivashayam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *