చెడ్డ వారికి సుఖాలు మంచి వారికి కష్టాలు వస్తాయా ?

ఇంటిలో రక రకాల ఆహారపదార్దాలు ఉన్నా వాడు సుఖవంతుడు కాదు, కడుపునిండుగా ఆకలి ఉంది తినగలవాడు సుఖవంతుడు. అదృష్టవంతుదంటే అందమైన భార్య కలవాడు కాదు, అనుభవించగలిగిన ఆరోగ్యం కలవాడు. గొప్పవాడు అంటే పెద్ద పదవులు, అధికారం, పేరు ప్రతిష్టలు ఉన్న వాడు కాదు ,రాత్రి కంటినిండుగా హాయిగా నిద్ర పోయేవారు. సంతృప్తి అంటే ఖరీదైన భవంతులు, కార్లు, నౌకర్లు ఉండటం కాదు, కట్టుకున్న భార్యా బిడ్డలతో కలసి ఉన్న దాంట్లో సంతోషంగా భతకటమే. జేబు నిండుగా డబ్బు, వంటి నిండా జబ్బు వున్నవాడు అదృష్టవంతుడు, సుఖఃవంతుడా ?

మంచి వారికి కష్టాలు చెడ్డవారికి సుఖములు వస్తాయి అన్న నానుడి ప్రజలలో ఉంది. ఈ విశ్వంలో బాగా ధనవంతులు అందరూ భోగ భాగ్యాలు అనుభవిస్తున్న వారు చెడ్డ వారు, దరిద్రంతో ,ఆకలి దప్పులతో ఉన్న వారు మంచి వారు అనేది అసూయ భావం మాత్రమే. ఇది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే మనం గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మ.

ఆస్ట్రాలజీ ప్రకారం మనకు భవిష్యత్ లో ఏమి జరుగుతుందా అని పుట్టినప్పుడే జోతిష్యునికి చూపించి చెప్పించుకుంటారు. అంటే దాని అర్థం చిన్నప్పుడే వీడు చెడ్డవాడు అవుతాడు, లేదా గొప్పవాడు అవుతాడు అని తెలుస్తుంది. అంటే మన సుఖ దుఃఖాలు మనం పుట్టినప్పుడే నిర్ణయించబడతాయి. అంటే అది పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న ఫలం ,నిన్ను పేదవాడి ఇంటిలోన లేక గొప్పవాడు ఇంటిలోన పుట్టే అవకాశం ఉంటుంది.

అనుకులవతి అయిన భార్య, మంచి పిల్లలు కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవి కావు. కష్ట సుఖాలు మనసులో ఉంటాయి . అవి అనుభవంలో అర్థం అవుతాయి. ఎవరికో ఏదో వున్నదని నీకున్న దాన్ని తక్కువ చేసుకోకు. మంత్రి భార్య అందగత్తె అయిన మనకేం లాభం, దాహం తీర్చలేని సముద్రం మనకు అవసరం లేదు. దప్పిక తీర్చే గ్లాస్ నీళ్లు మాదిరి ఉన్న పేదవాళ్లే గొప్ప.

కాబట్టి పేదవారికి చెడు జరగదు, పూర్వ జన్మ పుణ్యం వల్ల జరుగుద్ది. ఈ జన్మలో పుణ్య కార్యాలు చెయ్యండి మారు జన్మలో మీరు గొప్పవారుగా, సంతోషకరమైన జీవితం అనుభవిస్తారు అని మన శాస్త్రాలు, పురాణాలు, స్మృతులు చెబుతున్నాయి ఏమంటారు మీరు…………

మీ అశోక్ కనుమళ్ల

 

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

24 comments

 1. Great Words Anna Garu

 2. Raja Ramesh Reddy.Bandi

  Superrrr

 3. Excellent message.

 4. రామ్ మోహన్ శర్మ

  మంచి సమాచారం

 5. idi nijame swami

 6. Super words

 7. Super

 8. అక్షింతల పార్థసారథి

  Super

 9. Akshintala Sakuntala

  Good information

 10. A.Muni Krishna

  Good

 11. Akshintala Sakuntala

  Thq sir chalamanchi m s g
  Subhodayam

 12. Exactly

 13. Abunu nijame

 14. Padarthi Balaji

  Correct Ga chaparu

 15. Manchi vaalaki manche jarugutundi ayite

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *