ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? ముక్కోటి ఏకాదశి రోజు ఏ నియమాలు పాటించాలి

సూర్యుడు  ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది . ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి.

వైకుంఠ ద్వారం అంటే ఏమిటి ?

మన విష్ణుపురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.

వైకుంఠ ఏకాదశి అని ఆ రోజుకి రోజుకి పేరు ఎలా వచ్చింది?

పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం లో ఉంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు.

ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏమి చేయాలి ?ఏ ఏ నియమాలు పాటించాలి

ముక్కోటి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవసించినవారు పాప విముక్తులవుతారు. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును దేవుడిపై లగ్నం చేయాలి.

ఈ ముక్కోటి ఏకాదశి ఏకాదశి వ్రతం నియమాలు :

1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.

2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

3. అసత్య మాడరాదు.

4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.

5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.

6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.

7. అన్నదానం చేయాలి.

కాబట్టి  ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశి రోజున ఈ నియమాలను పాటించి మోక్షానికి అర్హులు అవుతారని ఆశిస్తున్నాను. సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించినా పాటించినా ఇరవై నాలుగు ఏకాదశులలో ఉపవాసం ఉన్నట్టే లెక్క లెక్క.

About Ashok Kanumalla

Ahsok

Check Also

దీపావళి నరక చతుర్దశి రోజున ఈ స్తోత్రం పఠించిన మీ కోరికలన్నీ తీరుతాయి

  ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉన్న ఫోటో ఉండకూడదు. లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ …

5 comments

  1. Mukkoti ekaadasi pramukyatha vivarana ichhinamduku Dhanyavadhamulu excellent 👌👌👌 information

  2. మంచి0 విషయం తెలుసుకున్న

  3. Excellent

  4. మల్లికార్జునరావు ఊరందూరు

    ప్రణామములు

  5. Supper ga chepparu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *