ఈ దీపావళి రోజున నువ్వుల నూనెతోనే దీపాలు పెట్టాలట! ఎందుకో తెలుసుకోండి
దీపావళి రోజున దీపాల వెలుగులు తమ ఇంటి ముందు వెదజల్లాలని స్త్రీలు తాపత్రయ పడతారు. ఇందులో భాగంగా కొత్త బట్టలు, తీపి వంటలు, టపాకాయలు వంటివి సిద్ధం చేసుకుని సాయంత్రానికల్లా దీపాలు పెట్టేందుకు సిద్ధమవుతారు. అయితే దీపాలకు ఉపయోగించే నూనె ఏది ఉపయోగించాలో కొందరు తెలియకపోవచ్చు.
ఈ దీపావళి రోజున నెయ్యితో దీపమెలిగించినా ఫలితం లేదని నువ్వులనూనెతోనే దీపాలు పెట్టాలని పెద్దలు అంటున్నారు. ఎందుకంటే దీపావళి రోజున లక్ష్మీదేవి నువ్వులనూనెలోనే నివాసముంటుంది. అందుకే దీపాలు పెట్టాలనే నియమం పాటించడం ఆనవాయితీగా వస్తుందని పండితులు అంటున్నారు. దీపావళి రోజున దీపాలు పెట్టడం ద్వారా లక్ష్మీదేవి ఆయా ఇళ్లలో నివాసముంటుందని వారు అంటున్నారు.
కాంతివంతమైన దీపం వెలుగులు ఎక్కడైతే విరజిమ్ముతూ ఉంటాయో అక్కడ దుష్ట శక్తులు నిలవలేవు. ఈ దివ్యమైన వెలుగులు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంటాయి. అందుకే దీపావళి రోజున నువ్వులనూనెతో దీపాలు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజిస్తూ వుంటారు. ఆ తల్లి అనుగ్రహంతో సిరిసంపదలను పొందుతుంటారు. అందుచేత దీపావళి రోజున నువ్వుల నూనెతో దీపమెలిగించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరు అష్టైశ్వర్యాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.
Good
చాలా అద్భుతమైన విషయం చెప్పారు అశోక్ కుమార్ గారు దీపావళి రోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి అని చాలా మందికి తెలియని విషయం దసరా శుభాకాంక్షలు అందరికీ ఆశోక్ కుమార్ గ్రూప్ సభ్యులకి
Good information 👌👌👌
Adbutamyna vivaranga chepparu
Tapaka patistamu
Good information